• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BJP MLA RAJA SINGH TO PLAY MAIN ROLE IN SAMBHAJI MOVIE HERE IS FULL DETAILS SK

Raja Singh: సినిమాల్లోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ యోధుడి బయోపిక్‌లో హీరో

Raja Singh: సినిమాల్లోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ యోధుడి బయోపిక్‌లో హీరో

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

శంభాజీ కథ బలమైనదన్న ఆయన మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుదని ధీమా వ్యక్తం చేశారు. అది సక్సెస్ అయితే.. భవిష్యత్‌లో మహనీయుల చరిత్ర ఆధారంగా సినిమాలు తీస్తానని చెప్పారు. ధర్మం కోసం త్యాగం చేసిన ఎందరో మహనీయుల కథలను తెరకెక్కిస్తామని పేర్కొన్నారు రాజాసింగ్.

  • Share this:
    రాజా సింగ్.. రాజకీయాల గురించి ఆసక్తి ఉండే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే. బీజేపీ ఫైర్ బ్రాండ్. దేశం కోసం.. ధర్మం కోసం..అంటూ నిత్యం వార్తల్లో ఉండే రాజాసింగ్.. గోషామహల్ ప్రజలకు ప్రియమైన నేత. ఒకవైపు ఎమ్మెల్యేగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూనే.. మరోవైపు గోరక్షకుడిగా గోవుల అక్రమ రవాణాపై తిరగబడుతున్నారు రాజాసింగ్. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఆవుల అక్రమ రవాణాను ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ఇలా అనుక్షణం బిజీగా ఉండే రాజాసింగ్..ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శంభాజీ మహా రాజ్ జీవిత గాధ ఆధారంగా సినిమాను తీయనున్నారు. అందులో శంభాజీ పాత్రను పోషించబోతున్నారు రాజాసింగ్.


    ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజాసింగ్.. శంభాజీ మూవీ విశేషాలను పంచుకున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించి వర్క్ ప్రారంభమైందని.. శంభాజీ లుక్ కోసం భారీగా బరువు తగ్గినట్లు చెప్పారు రాజాసింగ్.

    '' ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. శంభాజీ. ఈయన శివాజీ కంటే డేంజర్. ఔరంగజేబు తన సైన్యం మొత్తాన్ని దింపి వెతికినా శివాజీ దొరకలేదు. శివాజీ మరణించిన తర్వాత .. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారు. శంభాజీ చరిత్ర చాలా బాగుంది. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని, అందులో నేనే నటించాలని అనుకున్నా. నా బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గాను. ఆయన బాడీ ఎలా ఉందో.. ఫిజిక్ ఎలా ఉందో..అలా కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నా. తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీస్తాం.'' అని రాజాసింగ్ పేర్కొన్నారు.

    ప్రస్తుతం ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నామని రాజాసింగ్ చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని.. ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. శంభాజీ కథ బలమైనదన్న ఆయన.. మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుదని ధీమా వ్యక్తం చేశారు. అది సక్సెస్ అయితే.. భవిష్యత్‌లో మహనీయుల చరిత్ర ఆధారంగా సినిమాలు తీస్తానని చెప్పారు. ధర్మం కోసం త్యాగం చేసిన ఎందరో మహనీయుల కథలను తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. తన సినిమాల్లలో హీరోయిన్లతో ఆటపాటలు ఉండవని.. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు.

    కాగా, శంభాజీ రాజే భోంస్లే.. 1657, మే 14న జన్మించారు. ఈయన మరాఠా సామాజ్రానికి రెండో రాజు. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు శివాజీ, ఆయన మొదటి భార్య సాయి భోంస్లేకు పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. 1689, మార్చి 11న శంభాజీ మరణించారు. ఆయన 20 జులై, 1680 నుంచి 11 మార్చి, 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. శంభాజీని మొగల్ చక్రవర్తులు కుట్రచేసి బంధించి.. చిత్రహింసలు పెట్టి చంపారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నీ అప్పగించి.. ఇస్లాంలోకి మారితే.. వదలిపెడతానని మొగల్ చక్రవర్తులు చెప్పారు. కానీ ఆయన ప్రాణం పోయినా ఇస్లాంలోకి మారనని స్పష్టం చేశారు. దాంతో శంభాజీని జైల్లో బంధించి.. చిత్రహింసలు పెట్టి..చంపేసినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి వీరుడి బయోపిక్‌లో రాజాసింగ్ నటించనుండడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు