Home /News /movies /

BJP LEADER SWETHA REDDY KEY COMMENTS ON ARTIST KARATE KALYANI SB

డబ్బులు తీసుకోవడం బాగా అలవాటు..కరాటే కళ్యాణీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.అయితే ఆమె  ఆ సమయంలో ఇంట్లో లేదు. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు కరాటే కళ్యాణి.

తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.అయితే ఆమె ఆ సమయంలో ఇంట్లో లేదు. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు కరాటే కళ్యాణి.

తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.అయితే ఆమె ఆ సమయంలో ఇంట్లో లేదు. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు కరాటే కళ్యాణి.

    గత కొన్నిరోజులుగా మీడియాలో వినిపిస్తున్న పేరు.. కరాటే కళ్యాణి. తాజాగా ఈమె యూట్యూబర్ శ్రీకాంత్‌పై దాడి చేయడంతో... కరాటే కళ్యాణి (Karate Kalyani)పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అయితే శ్రీకాంత్ ఇంటికి వెళ్లి కళ్యాణి దాడి చేసిన సమయంలో ఆమెతో పాటు ఓనాలుగేళ్ల చిన్నారి ఉంది. దీంతో అందరికీ కళ్యాణి వద్ద ఉన్న ఆ చిన్నారి ఎవరు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్‌ వెల్ఫేర్ (Child Welfare)అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది.

    అయితే తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై కరాటే కల్యాణి స్పందించారు. ఎవరెవరు వెనకుండి నడిపిస్తున్నారో తనకు తెలుసని.. త్వరలో అన్ని వివరాలు చెప్తానని కల్యాణి స్పష్టం చేశారు. అన్యాయం జరిగితే సహించని వ్యక్తిత్వం ఉన్న తననే అన్యాయం చేశావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఏ ఆడపిల్లకు ఇలాంటి కష్టం రావొద్దని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రల్లో రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. తన ఇంట్లో పిల్లలు శివాజీ, ఝాన్సీలా పెరగాలని ఆలోచిస్తానని.. తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరటానికి సిద్ధమని అన్నారు. తాను పిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నానా అని ప్రశ్నించారు.

    అయితే కరాట్ కళ్యాణి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ మాజీ యాంకర్, బీజేపీ మహిళా నేత శ్వేతరెడ్డి (Swetha Reddy) స్పందించారు. శ్వేతారెడ్డి కరాటే కళ్యాణిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏ ఇష్యూ జరిగినా కరాటే కళ్యాణి టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొని కామెంట్లు చేస్తారని శ్వేతారెడ్డి అన్నారు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత నేను, గాయత్రి గుప్తా బిగ్ బాస్ షోపై విమర్శలు చేశామని శ్వేతారెడ్డి తెలిపారు. కరాటే కళ్యాణి బిగ్ బాస్ షో గొప్ప షో అని చెప్పి ఆ షోలో పాల్గొన్నారని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని కరాటే కళ్యాణి ప్రచారం చేసుకుంటారని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.

    నేను డబ్బుల కోసం బిగ్ బాస్ పై ఫిర్యాదులు చేశానని కరాటే కళ్యాణి అన్నారని శ్వేతారెడ్డి కామెంట్లు చేశారు.ప్రపంచం మొత్తం ప్రాంక్ వీడియోలు చేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపారు. హిందూ ధర్మం బిగ్ బాస్ షోకు వెళ్లాలని చెప్పిందా? అని ఆమె కరాటే కళ్యాణిని ప్రశ్నించారు. కరాటే కళ్యాణికి డబ్బులు తీసుకోవడం అలవాటు కాబట్టి అందరూ డబ్బులు తీసుకుంటారా? అని శ్వేతారెడ్డి కామెంట్లు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bjp, Karate Kalyani, Tollywood

    తదుపరి వార్తలు