Home /News /movies /

BJP CORPORATOR BLOCK RAM CHARA MOVIE SHOOTING IN HYDERABAD SB

Ram Charan: హైదరాబాద్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్‌కు షాక్.. అడ్డుకున్న కార్పొరేటర్..!

రామ్ చరణ్

రామ్ చరణ్

సరూర్‌నగరల్‌లో విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో షూటింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి అక్కడకు వచ్చిన ఓ కార్పొరేటర్ షూటింగ్‌కు అడ్డుతగిలారు.

    ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శంకర్ సినిమాలో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

    సరూర్‌నగరల్‌లో విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో షూటింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ షూటింగ్‌ను కార్పొరేటర్ అడ్డుకున్నారు. స్కూళ్లు నడుస్తున్న సమయంలో షూటింగ్‌కు ఎలా అనుమతి ఇఛ్చారని... బీజేపీకార్పొరేటర్ శ్రీవాణి సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. పిల్లల క్లాసులకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఆమె ఆరోపించారు. దీంతో సినిమా టీం.. షూటింగ్ నిలిపివేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.



    మరోవైపు రామ్ చరణ్ పాత్ర శంకర్ సినిమాలో ఎలా ఉంటున్నదానిపై ఇంట్రస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని.. ఓ పాత్రలోని చరణ్‌కు కోపం ఎక్కువగా ఉంటుందని.. అతడు చేసే మ్యానరిజం చూడటానికి చాలా బాగుంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మరొక పాత్రలో చరణ్ పల్లెటూరి నుండి వచ్చిన రాజకీయ నేతగా మనకు కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఈ రెండు పాత్రల్లో చరణ్ వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో పక్కనబెడితే, ప్రస్తుతం చరణ్ క్రేజ్ కారణంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని  సినిమా టీం భావిస్తుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bjp, Hyderabad, Ram Charan, Shankar

    తదుపరి వార్తలు