Home /News /movies /

BITTER EXPERIENCE TO COMEDIAN PRIYADARSHI IN JABARDAST SHOW HERE IS FULL DETAILS MNJ

Jabardast- Priyadarshi: ‘జబర్దస్త్‌’లో కమెడియన్ ప్రియదర్శికి అవమానం జరిగిందా..?

ప్రియ‌ద‌ర్శి

ప్రియ‌ద‌ర్శి

Jabardast- Priyadarshi: ‘జబర్దస్త్‌’ షో.. అనేది ఇప్పుడు ఏ సినిమాకైనా ప్రీ పబ్లిసిటీ ఇచ్చే ఒక మాధ్యమంగా ఉంది. ఎంతలా అంటే.. ఈ స్టేజ్‌పైకి వస్తే చాలు ఇక ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్‌లు ఇక అక్కర్లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫలానా సినిమాకు సంబంధించిన యూనిట్ షోకు వస్తోందంటే చాలు

ఇంకా చదవండి ...
  Jabardast- Priyadarshi: ‘జబర్దస్త్‌’ షో.. అనేది ఇప్పుడు ఏ సినిమాకైనా ప్రీ పబ్లిసిటీ ఇచ్చే ఒక మాధ్యమంగా ఉంది. ఎంతలా అంటే.. ఈ స్టేజ్‌పైకి వస్తే చాలు ఇక ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్‌లు ఇక అక్కర్లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫలానా సినిమాకు సంబంధించిన యూనిట్ షోకు వస్తోందంటే చాలు.. స్కిట్‌లు కూడా దాదాపు ఆ సినిమా చుట్టూ తిరిగేలా, సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పేలానే ఉంటున్నాయి. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ సంచలన విజయం దిశగా అడుగులేస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో నవీన్, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా, కమెడియన్ ప్రియ‌ద‌ర్శి ముగ్గురూ జబర్దస్త్‌కు షోకు విచ్చేశారు. అయితే ఈ షో మ‌ధ్య‌లోనే ప్రియ‌ద‌ర్శి వెళ్లిపోవ‌డంపై ఇప్పుడు ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

  స్కిట్ అవ్వగానే జడ్జ్‌ల రియాక్షన్ అవ్వగానే షోకు గెస్ట్‌లు అదేనండోయ్ సినిమా ప్రమోషన్‌కు వచ్చిన వాళ్ల కామెంట్స్ కూడా యాంకర్ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. స్కిట్ ఎలా ఉంది..? అందులో వారికి నచ్చిన డైలాగ్స్ కానీ, పాత్ర కానీ ఫలానా అని వారి తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. అయితే.. ఎందుకు ఏమో గానీ గెస్ట్‌గా వచ్చిన కొందర్నీ అప్పుడప్పుడు మరిచిపోతూ వారిని అవమానిస్తున్నారనే విమర్శలు ఈ మధ్య ‘జబర్దస్త్’పైన పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయ్. ఇందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే చక్కటి ఉదాహరణ అని నెట్టింట్లో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

  అసలేం జరిగిందంటే.. మార్చి-11న ‘జబర్దస్త్’ ఎపిసోడ్‌కు ‘జాతిరత్నాలు’ సినిమా నటీనటులైన నవీన్, ఫ‌రియా అబ్దుల్లా, ప్రియ‌ద‌ర్శి వచ్చారు. సుమారు 45 నిమిషాల పాటు షోను ఎంజాయ్ చేసి పనిపనిలో పనిగా.. తన సినిమాకు కావాలిసినంత ప్రమోషన్ చేసేసుకున్నారు. అయితే.. ప్రతి స్కిట్ అయ్యాక అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే యాంకర్ అనసూయ.. ఎందుకో ప్రియదర్శిని మరిచిపోయింది. ఇలా ఒక్క స్కిట్ కాదు.. రెండు స్కిట్‌లు అవుతున్నా అడ‌గ‌లేదు. ఇక‌ స్కిట్ అవ్వగానే పాపం.. తన అభిప్రాయన్ని అడుగుతారేమో చెబుతామని ఎంతగానో వేచి చూసిన ప్రియదర్శి.. చూసి చూసి తీవ్ర అసంతృప్తికి లోనైన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో షో నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. అందుకే షో చివ‌రి వ‌ర‌కు ప్రియ‌ద‌ర్శి క‌నిపించ‌లేద‌ని టాక్.

  ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గానే చర్చ జరుగుతోంది. అదేంటి ప్రియదర్శిని అలా పక్కనెట్టేశారు..? కనీసం మర్యాద ఇవ్వనక్కర్లేదా..? కనీసం యాంకరమ్మకు తెలియకపోతే సరి.. ఆ జడ్జ్‌లు కానీ, ప్రోగ్రామ్ డైరెక్టర్స్ అయినా ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోండి అని ఎందుకు చెప్పలేదు..? అని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ ఎపిసోడ్ తాలుకూ వీడియో కింద కొందరు ప్రేక్షకులు, ప్రియదర్శి ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరోవైపు కొందరేమో ఇలా అవమానించినందుకే మధ్యలోనే ప్రియదర్శి వెళ్లిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఆయన అవమానంగానే భావించి వెళ్లిపోయాడా..? లేకుంటే ఏదో ఇంపార్టెంట్ పని పడటంతో వెళ్లిపోయాడా..? అన్నది ఆయనే రియాక్ట్ అయితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. ప్రియదర్శి కూడా ఒక కమెడియన్ కమ్ హీరో కదా.. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటే షోకు వచ్చే నష్టమేమీ లేదు కదా..!
  Published by:Manjula S
  First published:

  Tags: Jabardasth, Jathi Ratnalu, Priyadarshi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు