బిత్తిరి సత్తి హీరో అయ్యాడోచ్.. TRS ఎమ్మెల్యేతో వస్తున్న ‘తుపాకి రాముడు’..

ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా అంతే. సాధారణ న్యూస్ ఎంప్లాయి స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఏకంగా హీరో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 4:04 PM IST
బిత్తిరి సత్తి హీరో అయ్యాడోచ్.. TRS ఎమ్మెల్యేతో వస్తున్న ‘తుపాకి రాముడు’..
తుపాకి రాముడు ట్రైలర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 4:04 PM IST
ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా అంతే. సాధారణ న్యూస్ ఎంప్లాయి స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు. ఓ ఛానెల్‌లో తీన్మార్ అంటూ ఫేమస్ అయిన ఈయన.. ఇప్పుడు ఏకంగా వెండితెరపై తన సత్తా చూపిస్తున్నాడు. చిన్న చిన్న కారెక్టర్స్ వేస్తూ పైకి వచ్చిన సత్తి.. తుపాకి రాముడు అంటూ హీరోగా మారిపోయాడు. ఒకప్పుడు బతుకమ్మ, ఆల్ రౌండర్, కిష్కింద కాండ లాంటి సినిమాలు చేసిన టి ప్రభాకర్ దీనికి దర్శకుడు. TRS ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనికి నిర్మాత కావడం విశేషం.

రసమయి ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి అందులోనే ఈ చిత్రం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. పక్కా తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. అక్టోబర్ 25న దివాళి కానుకగా తుపాకి రాముడు విడుదల కానుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ హీరో రేంజ్‌లో రెచ్చిపోయాడు బిత్తిరి సత్తి. కామెడీ ఒక్కటే కాదు.. ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు టి ప్రభాకర్. అయితే ఈ చిత్రం వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఎంత ప్రమోషన్స్ చేస్తున్నా కూడా తుపాకి రాముడుకు ఓపెనింగ్స్ అయినా వస్తాయా అనేది అనుమానమే. మొత్తానికి ఏదేమైనా కూడా బిత్తిరి హీరోయిజం ఎలా ఉండబోతుందో చూడాలిక.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...