
బిత్తిరి సత్తి(ఫైల్ ఫోటో)
Bithiri Sathi: బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది.
బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది. తన న్యూస్ చదువుకుని.. తీన్మార్ స్టెప్పులు వేయించి వెళ్లిపోయే సత్తి కొన్ని రోజుల కింద తనే న్యూస్ అయిపోయాడు. ఉన్నట్లుండి ఛానెల్ మారిపోయి.. మరో ఛానెల్ వెళ్లి అక్కడ పాత వైభవం చూపించలేక మళ్లీ అక్కడ్నుంచి ఇంకో ఛానెల్ వైపు వెళ్లాడు. అక్కడ కూడా నానా ఇబ్బందులు పడ్డాడు పాపం. ఆ తర్వాత కరోనా బారిన పడి బయటపడ్డాడు. ఇదే సమయంలో తుపాకి రాముడు అంటూ సినిమా కూడా చేసాడు. ఆ సినిమా ఎలా ఉందనేది పక్కనబెడితే ఆ తర్వాత సాక్షిలో చేరి ఫుల్ బిజీ అయిపోయాడు బిత్తిరి సత్తి. చాలా రోజుల తర్వాత ఈయన మళ్లీ సోషల్ మీడియాలో సందడి చేసాడు. జనవరి 24న బిత్తిరి సత్తి పెద్ద కొడుకు శివ పుట్టిన రోజు. దాంతో కొడుకు బర్త్ డే రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకును అందరికీ పరిచయం చేసాడు సత్తి. ముఖ్యంగా బిత్తిరి సత్తి కొడుకును చూసి నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. వామ్మో సత్తి కొడుకు ఇంత పెద్దోడా.. ఇంత పెద్ద కొడుకున్నాడా అంటూ షాక్ అవుతున్నారు. తన కొడుకును పరిచయం చేయడమే కాకుండా వాళ్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు సత్తి. తన కొడుకులకు తానిచ్చే ఆస్తి వేరేదేం లేదని.. నవ్వులు మాత్రమే అంటున్నాడు ఈయన.
నవ్వించే పరంపరను తన వారసులు కొనసాగిస్తారని చెప్తున్నాడు బిత్తిరి సత్తి. తన కొడుకు పుట్టిన రోజు నాడు అందరికీ పరిచయం చేయడమే కాకుండా.. తనకంటే ఎదిగిపోయాడని.. నాలుగు ఇంచులు ఎక్కువే ఉన్నాడని చెప్పాడు సత్తి. అంతేకాదు.. బర్త్ డే రోజు తమకు లైక్ కొట్టిన వాళ్లను.. కామెంట్ చేసిన వేల మందిని చూపిస్తూ వాళ్లంతా తమ వాళ్లే అని కొడుకుకు చెప్పాడు బిత్తిరి సత్తి. ఏదేమైనా కూడా బిత్తిరి సత్తి పోస్ట్ చేసిన ఎమోషనల్ పోస్ట్ మాత్రం వైరల్ అవుతుందిప్పుడు.
Published by:Praveen Kumar Vadla
First published:January 24, 2021, 21:54 IST