Home /News /movies /

BIRTHDAY WISHES TO NATASIMHAM NANDAMURI BALAKRISHNA FROM HIS GRAND SONS SB

Balakrishna: బాలయ్య బర్త్‌డే రోజున.. హైలెట్ ఫోటో ఇదే..!

మనవళ్లతో బాలకృష్ణ

మనవళ్లతో బాలకృష్ణ

ఈ ఏడాది బాలకృష్ణ తన బర్త్ డే వేడుకలు ఇంట్లోనే చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు తన ఇద్దరు మనవళ్లు.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

    నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా బాలయ్య వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఈరోజు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనేక చోట్ల రక్తదానాలు చేశారు. సోషల్ మీడియా(Social Media) వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు సైతం బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. బాలయ్య కూడా బసవతారకం ఆసుపత్రికి వెళ్లి అక్కడ సిబ్బందితో తన పుట్టినరోజు వేడుకలను ఉదయం జరుపుకున్నారు. పుట్టినరోజున బాలయ్య హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలోనే ఉన్నారు.

    అయితే ఈసారి బర్త్ డే రోజున ఇంట్లోనే ఉండి కుటుంబసభ్యులతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఈ పుట్టిన రోజుకు బాలయ్య తన మనవళ్లతో గడిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో(Basava Tarakam cancer Hospital) తన పుట్టినరోజు వేడుకలు అయిన వెంటనే బాలయ్య ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లోనే ఉండి మనవళ్లతో సరదాగా గడిపారు. తన ఇద్దరు కూతుళ్ల ముద్దుల కుమారులు బాలయ్యకు ఈ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వారితో ఆడుకుంటూ తన పుట్టినరోజు వేడుకలను వైరైటీగా ఈ ఏడాది జరుపుకున్నారు.



    బాలయ్య మనవళ్లతో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పుట్టినరోజును నందమూరి నటసింహం తన మనవళ్లతో చేసుకోవడం విశేషంగా మారింది. అంతేకాదు బాలయ్య ఇద్దరు కూతుళ్ల కొడుకులు తాతగారికి ఒక మంచి గిఫ్టును కూడా ఇచ్చారు. NBK అని రాసి ఉన్న ఆ గిఫ్ట్ ను అందుకున్న బాలయ్య ముఖంలో చిరునవ్వులు కనిపించాయి. బాలకృష్ణ కూడా ఈ ఫోటోలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

    ఇకపోతే ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా 108వ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఎఫ్ 3తో బంపర్ హిట్ కొట్టేసి మాంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించారు. ఇవాళ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Balakrishna, Nandamuri balakrishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు