హాస్య బ్రహ్మా జంధ్యాల స్మృతిలో... తెలుగు తెర హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు..

తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల. నేడు జంధ్యాల జంధ్యాల జయంతి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 14, 2020, 3:18 PM IST
హాస్య బ్రహ్మా జంధ్యాల స్మృతిలో...  తెలుగు తెర హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు..
హాస్యబ్రహ్మా జంధ్యాల
  • Share this:
తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల. నేడు జంధ్యాల జంధ్యాల జయంతి.నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీమార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించారు జంధ్యాల. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ దృష్టిలో పడ్డాడు. రచయతగా జంధ్యాల తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
శంకరాభరణం మూవీ


ఇటు ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే... ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించాడు జంధ్యాల. మాటల రచయతగా ప్రారంభమైన జంధ్యాల సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. తన సినిమాలు కుటుంబ సభ్యులు అందరు కూర్చోని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించాడు జంధ్యాల. డైరెక్టర్ గా ఆయన తొలి చిత్రం ‘ముద్ద మందారం’. తొలి చిత్రం తోనే సక్సెస్ అందుకున్నారు జంధ్యాల.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
ముద్ద మందారం


ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాలది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు, వేలుని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసాడు. ఆ తర్వాత ఈ సుత్తిజంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
నాలుగు స్థంభాలాటలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు (యూట్యూబ్ క్రెడిట్)


తెలుగ వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకుడు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోటతో బ్రహ్మానందాన్ని తిట్టించినా.. అది జంధ్యాలకు మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్ గా ఎదగడంలో జంధ్యాల పాత్ర మరిచిపోలేనిది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియోటర్లకు రప్పించడంలో జంధ్యాల ది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా.... పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా...హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా...శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా... ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీలక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాలకే సొంతం.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
చూపులు కలిసిన శుభవేళ (యూట్యూబ్ క్రెడిట్)


క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ‘ఆనందభైరవి’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. హీరో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల కి ప్రత్యేక అనుబంధం ఉంది. కామెడీహీరోగా రాజేంద్రపసాద్ నిలదొక్కుకోవడానికి జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాలు కీ రోల్ పోషించాయి.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
జయమ్ము నిశ్చయమ్మురా (యూట్యూబ్ క్రెడిట్)


జంధ్యాల ఒక్కో చిత్రం హాస్యపు ఆణిముత్యం. మెగాస్టార్ తో సైతం ‘చంటబ్బాయి’ గా చిత్ర విచిత్ర వేషాలు వేయించిన ఘనపాటి జంధ్యాల. ఈ సినిమాలో చిరంజీవిని జేమ్స్ పాండ్ గా మార్చి ప్రేక్షకులపై హాస్యపు జల్లులు కురిపించాడు. అలాగే చిరంజీవిలో ఉన్న మంచి కామెడీ నటుడ్ని వెలికి తీసిన ఘనత కూడా హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
చంటబ్బాయి (యూట్యూబ్ క్రెడిట్)


‘అహనా పెళ్లంట’, ‘ఒహోనా పెళ్లంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘జయమ్ము నిశ్మయమ్మురా’, ‘వివాహా భోజనంబు’...వంటి పాత తెలుగు సినిమాల్లోని పాటల పల్లవులు తన చిత్రాలకు టైటిల్స్ గా పెట్టి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు జంధ్యాల. టైటిల్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేయడంలో జంధ్యాలకు సాటి మరెవరు లేరూ.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
హాస్యబ్రహ్మా జంధ్యాల


దర్శకుడిగా కాకుండా నటుడిగా సైతం మెప్పించాడు జంధ్యాల. కళా తపస్వీ దర్శకత్వం వహించిన ‘ఆపద్భాందవుడు’లో అద్భుతాభినయాన్ని కనపరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటుడిగా, రచయతగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించి మెప్పించాడు జంధ్యాల.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
ఆపద్భాందవుడులో జంధ్యాల


హీరో ఎవరైనా..నటీనటులు ఎవరైనా...తన మార్కు హాస్యం ఉండేలా జాగ్రత్త తీసుకునేవాడు జంధ్యాల. ఆయన ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉండేలా చూసుకునేవాడు జంధ్యాల. తన సినిమాలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటిన దర్శకుడు జంధ్యాల. తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001 జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచుతు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన మరణించినా తన చిత్రాలతో నేటికి హాస్యప్రియులను తన సినిమాలతో నవ్విస్తునే ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 14, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading