హోమ్ /వార్తలు /సినిమా /

స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు

స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు

నటభూషణ శోభన్ బాబు

నటభూషణ శోభన్ బాబు

నటభూషణ శోభన్ బాబు.. ఈ పేరు చెబితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కథలు మెమరీకి వస్తాయి. సినిమాలకూ ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన అందగాడు.

ఇంకా చదవండి ...

  టాలీవుడ్ సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి రావు. 1937, జనవరి 14న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారాయన. కాలేజ్ డేస్‌లో ఏర్పడ్డ సినిమాలపై ప్రేమ ఆయన్ను మద్రాస్ రైలెక్కించింది. ‘మల్లీశ్వరి’ సినిమాను 20 సార్లు పైగా చూసి సినిమా యాక్టర్ కావాలని ఆశించారు. నటుడిగా ఆయన మొదటి సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దైవబలం’.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  శోభన్‌బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

  కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను అవకాశాలను అందిపుచ్చుకొని తెలుగులో అగ్ర హీరోగా ఎదిగారు..‘సీతారామకళ్యాణం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’ వంటి సినిమాల్లో సైడ్ కేరెక్టర్లు వేశారు శోభన్ బాబు. టైటిల్ కేరెక్టర్ పోషించిన ‘వీరాభిమన్యు’తో నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.

  శోభన్ బాబు సోలో హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’.. తర్వాత వచ్చిన ‘బంగారు పంజరం’కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. నేషనల్ లెవల్ క్లాసికల్ నటుడి అవార్డొచ్చింది. ‘మనుషులు మారాలి’తో సరైన బ్రేక్ లభించింది. ఈ సినిమా తర్వాత శోభన్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  శోభన్‌బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

  శోభన్ బాబు- శారదలది.. క్రేజీ కాంబినేషన్.. ‘శారద’ నుంచి ‘ఏవండీ ఆవిడొచ్చింది’ వరకూ వీరి జోడీ జేజేలు కొట్టించుకుంది. ఆ తర్వాత శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, సుహాసినీ వంటి హీరోయిన్లతో కలసి ఎన్నో సూపర్ హిట్లిచ్చారు శోభన్ బాబు. ‘కార్తీక దీపం’ వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటాయి.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  శోభన్‌బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

  ఇటు క్లాస్ అటు మాస్.. చిత్రాల్లో నటించి అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు శోభన్ బాబు. ‘మానవుడు- దానవుడు’తో మాస్ ఫాలోయింగ్ స్టార్టయింది.ఆ తర్వాత ‘జగజ్జెట్టీలు’, ‘అడవిరాజు’, ‘కాళిదాసు’, ’ప్రతీకారం’ సినిమాలతో మాస్‌లోనూ మంచి ఇమేజ్ సాధించారు.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  సంపూర్ణ రామాయణంలో శోభన్‌బాబు (యూట్మూబ్ క్రెడిట్)

  రాముడి పాత్రంటే ఎన్టీఆరే. కానీ బాపూ డైరెక్షన్లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’తో శోభన్ బాబు కూడా ఆ పాత్రకు న్యాయం చేసారు. ఈ సినిమాకు ముందొచ్చిన ‘బుద్ధిమంతుడు’ ఆ తర్వాత తెరకెక్కిన ‘కురుక్షేత్రం’లో కృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు కూడా.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  బుద్ది మంతుడులో శోభన్‌బాబు (యూట్యూబ్ క్రెడిట్)

  ఆ తర్వాత సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ‘ధర్మపీఠం దద్దరిల్లింది’, ‘దేవాలయం’ సినిమాలు నటుడిగా శోభన్‌ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి.తన యాక్టింగ్ స్కిల్స్ తో అనేక అవార్డులూ రివార్డులూ అందుకున్నారు శోభన్ బాబు.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  రామానాయుడు, కృష్ణలతో శోభన్ బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

  ఐదుసార్లు నంది అవార్డులు, వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. దిలీప్ కుమార్ తర్వాత ఫిలింఫేర్ హాట్రిక్ సాధించింది శోభన్ బాబే.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  కురుక్షేత్రంలో శోభన్ బాబు (యూట్యూబ్ క్రెడిట్)

  శోభన్ బాబు తన ముప్పైఏళ్ల కెరీర్ లో మొత్తం 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. 96లో రిలీజైన ‘హలోగురు’తో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి వరకూ ఏ నటుడూ పాటించని రిటైర్మెంట్ ప్రకటించారు.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  కృష్ణార్జునులు సినిమాలో కృష్ణతో శోభన్ బాబు

  శోభన్ బాబులో నటుడే కాదు.. చక్కటి మార్గదర్శి కూడా ఉన్నారు. భూముల డిమాండ్ పెరగడం గ్యారంటీ అని ఆయన ఇచ్చిన సలహా పాటించి కోటీశ్వరులైన వారున్నారు. తన ఫ్యామిలీ నుంచి ఎవరినీ సినిమా ఫీల్డ్ కు రానివ్వలేదాయన.

  Birth anniversary Tollywood Ever Green Hero Shobhan Babu స్మృతిలో: ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు
  శోభన్‌బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

  అంతటి ప్రొఫెషనల్ నటుడు శోభన్ బాబు. 2008 మార్చి 20 న చెన్నైలో కన్నుమూశారు శోభన్ బాబు. ఆయన లేకున్నా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

  ఇవి కూడా చదవండి

  ఓరి దేవుడా.. రాజ్‌కుమార్ హిరాణీ కూడా అలాంటి వాడేనా..?

  RRR సినిమా సెకండ్ షెడ్యూల్ ఎప్ప‌ట్నుంచో తెలుసా..?

  స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల

  First published:

  Tags: Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు