టాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్...‘ఎన్టీఆర్’ మూవీతో పెరిగిన క్రేజ్

ఎన్టీఆర్‌గా బాలయ్య..జయలలితగా నిత్యామేనన్

‘మహానటి’ సక్సెస్‌తో టాలీవుడ్‌లో సినీ నటీనటుల జీవితాలపై తెరకెక్కే సినిమాలకు గిరాకీ పెరిగింది. ఇప్పటికే ‘స్వర్గీయ నందమూరి తారక రామారావు’ జీవిత కథపై క్రిష్ దర్శకత్వంలో ఆయన తనయుడు బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు.మరోవైపు జయలలిత సహా పలువురి నటీనటులకు సంబందించిన బయోపిక్స్ సెట్స్‌పై ఉన్నాయి.

 • Share this:
  ‘మహానటి’ సక్సెస్‌తో టాలీవుడ్‌లో సినీ నటీనటుల జీవితాలపై తెరకెక్కే సినిమాలకు గిరాకీ పెరిగింది. ఇప్పటికే ‘స్వర్గీయ నందమూరి తారక రామారావు’ జీవిత కథపై క్రిష్ దర్శకత్వంలో ఆయన తనయుడు బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ మూవీని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’, ‘ఎన్టీఆర్..మహానాయకుడు’ గా రెండు పార్టులుగా నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేయనున్నారు.

  ‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో మహానటుడి సినీ జీవితాన్ని...‘ఎన్టీఆర్..మహానాయకుడు’లో రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మూవీలో ఏకంగా పది మందిపైగా కథానాయికలు నటించారు.ఇప్పటికే రిలీజైన ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది.

  ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దుర్యోధనుడిగా బాలయ్య


  ఇపుడు అదే రూట్లో మరికొంత మంది నటీనటుల జీవితాలను సిన్మాలుగా తెరకెక్కించనీకి టాలీవుడ్ల రంగం సిద్ధం అవుతుంది.

  ఎన్టీఆర్ బయోపిక్


  సావిత్రి,ఎన్టీఆర్ బయోపిక్ లే కాదు....ఆ మాటకు వస్తే రామారావు, సావిత్రిల కంటే కొన్నేళ్లు సీనియర్ అయిన అక్కినేని నాగేశ్వర్రావు జీవితంపై సినిమాను తెరకెక్కించేందుకు నాగార్జున స్క్రిప్ట్ వర్క్ రెడీ చేయిస్తుండట. ఐతే...ప్రస్తుతానికీ ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. ఏది ఏమైనా తొందర్లనే నాగార్జున ఈ బయోపిక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశమైతే పుష్కలంగా ఉంది.

  Sumanth Subramaniapuram Censor Completed with U/A.. ఏమో ఇప్పుడు సుమంత్ సినిమా చూస్తుంటే ఇదే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈయన ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ కానీ.. ట్రైలర్ కానీ చూసిన తర్వాత అంద‌రికీ "కార్తికేయ‌"కు సీక్వెల్ చేస్తున్నాడా అనుకున్నారంతా. ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తి అయిపోయింది. దీనికి U/A సర్టిఫికేట్ వచ్చింది. sumanth Subramaniapuram, teaser, look like, karthikeya,nikhil.chandu mondeti,sumanth akkineni,sumanth,akkineni menalludu,idam jagath,malli rava,సుమంత్,అక్కినేని మేనల్లుడు,మళ్లీరావా,సుబ్రహ్మణ్యపురం,ఈషారెబ్బా,ఈషా రెబ్బా,కార్తికేయ,నిఖిల్,చందూమొండేటి
  ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేని పాత్రకు ప్రాధాన్యత


  ఒకవైపున ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతోను..మరోవైపు ఏఎన్నాఆర్ సాంఘిక చిత్రాలతో అదరగొట్టేస్తున్న కాలంలోనే జానపద చిత్రాలతో తనదైన ప్రత్యేకత చాటుకున్న నటుడు కాంతారావు. నటుడిగా జానపద చిత్రాలే కాదు...పౌరాణిక..చారిత్రక..సాంఘిక చిత్రాల్లో ఎన్నో ముఖ్యవేశాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు కాంతారావు. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కాంతా రావు...కొన్ని సిన్మాలతో నిర్మాతగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదురుకొన్నాడు.  ఒక సినిమాకు కావాల్సినంత మసాలా వున్న కాంతారావు జీవితాన్ని దర్శకుడు పీసీ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.

  Kantha Rao Birth Day Special Article
  కాంతారావు (యూట్యూబ్ క్రెడిట్)


  మరోవైపు అతిలోకసుందరిగా యావత్ భారత దేశ ప్రజల నీరాజనాలు అందుకొని...తిరిగిరాని లోకాలకు వెళ్లిన శ్రీదేవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నయట.

  legendary actress sridevi
  శ్రీదేవి న్యూస్18


  మరోవైపు హెలికాప్టర్ ప్రమాదంల అకాల మరణం చెందిన సౌందర్య జీవితాన్ని కూడా వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది.

  Soundarya Birth Day Special
  సౌందర్య (ఫేస్‌బుక్ ఫోటో)


  తాజాగా తెలుగు, తమిళ ప్రజలను తన నటనతో ఆకట్టుకొని..ఆ తర్వాత రాజకీయాల్లో రాణించి ముఖ్యమంత్రి అయిన తొలి కథానాయికగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితకథను..తమిళంలో ‘ది ఐరన్ లేడీ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకురాలు ప్రియదర్శని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో నిత్యామీనన్ అచ్చు..అమ్మ జయలలితను పోలి ఉంది.

  జయలలిత పాత్రలో నిత్యామీనన్


  మరోవైపు శృంగార తారగా పేరుగాంచిన షకీలా జీవితాన్ని కూడా వెండితెరపై తెరకెక్కుతోంది. ఈ మూవీలో రిచా చద్దా షకీలా పాత్రలో నటించబోతుంది.

  First look of Richa Chadha from the Shakeela Biopic is Out!
  షకీలా బయోపిక్‌లో రిచా చద్దా


  మరోవైపు తెలుగు పాటను తన గానంతో అమరత్వం ప్రసాదించిన ఘంటసాల వేంకటేశ్వర్రావు జీవితాన్ని వెండితెరపై ‘ఘంటసాల’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివంగత ఘంటసాల పాత్రలో ప్రముఖ గాయకుడు కృష్ణచైతన్య నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఘంటసాల పాత్రలో కృష్ణచైతన్య (ఫేస్‌బుక్ ఫోటో)


  మొత్తానికి ‘మహానటి’ సక్సెస్‌తో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్...ఒకళ్ల వెనకాల ఒకళ్లు సినిమా యాక్టర్స్ జీవితాల మీద బయోపిక్‌లు తెరకెక్కించడంలో నిమగ్నమయ్యారు.


  ఇది కూడా చదవండి 

  సంక్రాంతి ‘బాలయ్య’..పండగ బరిలో ఆయనకు ‘ఎన్టీఆర్’ ఎన్నో సినిమానో తెలుసా

  ఎన్టీఆర్, నాని..ఇపుడు వెంకటేష్

  ఎన్టీఆర్‌తో పాటు ఆ ఛాన్స్ దక్కించుకున్న రామ్ చరణ్‌

   
  First published: