గతంలో నాలుగు సీజన్లతో ఇంటింటా వినోదం పంచిన రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) అంటూ ఓటీటీ OTT వేదికపై ప్రసారమైన సంగతి తెలిసిందే. 12 వారాల పాటు సాగిన ఈ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి (Bindu Madhavi). దీంతో ఇప్పటిదాకా సినిమాల ద్వారా వచ్చిన దాన్ని మించి పాపులారిటీ కూడగట్టుకుంది బిందు మాధవి. బిగ్‌బాస్ చరిత్రలో ట్రోపీ అందుకున్న తొలి మహిళగా ఆమె నిలిచింది. బిగ్ బాస్ ట్రోపీ (Bigg Boss Trophy) గెలిచాక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె బిగ్ బాస్ హౌస్ విషయాలు చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బిందు మాధవి పెళ్లి మ్యాటర్ బయటకురావడంతో దీనిపై ఆమె తండ్రి రియాక్ట్ అయ్యారు. ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ ఓపెన్ అయ్యారు.
తన కూతురు బిందు ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చానని, ఆ సమయంలో మంచి మంచి సంబంధాలు వచ్చాయని, పెళ్లి చేసుకోవాలంటూ చాలా ఒత్తిడి కూడా చేశామని ఆయన చెప్పారు. మంచి సంబంధాలు వదులుకోలేక ఓ తండ్రిగా వెంటనే పెళ్లి చేసుకో అని బిందుని ఫోర్స్ చేసినా ఆమె ఒప్పుకోలేదని అన్నారు. సినిమాల్లోకి వచ్చాక కూడా కొన్ని సంబంధాలు చూసినా నో చెప్పిందని తెలిపారు. నేనేం చిన్నపిల్లను కాదు కదా? నేనే చూసుకుంటాను నాన్న అని బిందు అనేదని, నేను చెప్పినప్పుడే నా పెళ్లి చేయండి అని చెప్పిందని ఆమె తండ్రి పేర్కొన్నారు. కాలం మారింది.. పిల్లల ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన రోజులు వచ్చాయని ఆయన అన్నారు.
''ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్'' లాంటి తెలుగు సినిమాలతో అలరించింది బిందు మాధవి. తమిళ బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన బిందు అక్కడ నాలుగో రన్నరప్‌గా నిలిచి.. ఇప్పుడు తెలుగులో ఏకంగా ట్రోఫీ గెలుచుకుంది. షో విజేతగా నిలిచినందుకు ఆమెకు 40 లక్షలు రాగా.. 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు మరో 55 లక్షలు వచ్చాయని సమాచారం. మొత్తంగా చూస్తే బిగ్ బాస్ విన్నర్‌గా బిందుమాధవి కోటి రూపాయలకు పైగానే వెనకేసిందని టాక్. ప్రస్తుతం బిందుకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బిగ్‌బాస్ విన్నర్ అయింది కాబట్టి ఆమె సినీ కెరీర్ ఇక గాడిలో పడుతుందని, మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.