BINDU MADHAVI BECOMES THE BIGG BOSS NON STOP TELUGU TITLE WINNER HERE ARE THE DETAILS SR
Bigg Boss Non Stop : చరిత్ర సృష్టించిన బింధు మాధవి.. మరోసారి రెండో స్థానంలో అఖిల్..
Bindu Madhavi Photo : Twitter
Bigg Boss Non Stop : బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగింపు దశకు చేరుకుంది. హౌజ్‌లోకి 17 మంది కంటెస్టెంట్స్ వస్తే.. చివరకు ఏడుగురు కంటెస్టెంట్ లతో మిగిలిపోగా.. ఈ సారి టైటిల్ విన్నర్‌గా తెలుగు అమ్మయి బింధు మాధవి నిలిచారు. రెండో స్థానంలో అఖిల్ సార్థక్ ఉన్నారు. అఖిల్ నాలుగో సీజన్లో కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
Bigg Boss Non Stop Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్.. ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే (Bigg Boss Telugu OTT). దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగింపు దశకు చేరుకుంది. హౌజ్‌లోకి 17 మంది కంటెస్టెంట్స్ వస్తే.. చివరకు ఏడుగురు కంటెస్టెంట్ లతో మిగిలిపోగా.. ఈ సారి టైటిల్ విన్నర్‌గా తెలుగు అమ్మయి బింధు మాధవి నిలిచారు. రెండో స్థానంలో అఖిల్ సార్థక్ ఉన్నారు. అఖిల్ నాలుగో సీజన్లో కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇక బింధు మాధవి (Bindu Madhavi) బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన మొదటి మహిళ కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. మొదటి సీజన్లో శివ బాలాజీ, రెండవ సీజన్లో కౌషల్, మూడోవ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగవ సీజన్లో అభిజీత్, ఐదవ సీజన్లో సన్ని గెలవగా.. మొదటి సారి ఈ కొత్త ఫార్మాట్లో ఓ మహిళగా టైటిల్ విన్నర్ అవ్వడం విశేషం. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ రేపు ప్రసారం కానుంది. ఇక వరకు హౌజ్‌లో ఎనిమిది మంది ఉండగా... లాస్ట్ వీక్ నామినేషన్లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌజ్‌లో మిగిలిన వారి విషయానికొస్తే.. అనిల్ రాథోడ్, మిత్రశర్మ, అరియనా గ్లోరీ, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవిలు ఉన్నారు.
First time a contestant who I supported won the finale. Thank you #BinduMadhavi for giving us the feeling.
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజేతకు టైటిల్‌తో పాటు 25లక్షల ప్రైజ్ మనీ అందోచ్చని అంటున్నారు. ఇక మరోవైపు ఈ ఫినాలే కార్యక్రామానికి గెస్ట్‌లు ఎవరు రాకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ నాన్ స్టాప షో.. రెగ్యూలర్‌గా వచ్చే బిగ్ బాస్ షో రేంజ్లో మాత్రం పాపులర్ కాలేదనే అంటున్నారు. అయితే ఈ షోలో పాల్గోన్న కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు. అందులో ముఖ్యంగా అజయ్, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్ , మిత్రా శర్మా, యాంకర్ శివలు ముఖ్యంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ నాన్ స్టాప్ నుంచి కొంతమందిని బిగ్ బాస్ సీజన్ 6కు తీసుకోబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అందులో వీరు ఉండబోతున్నట్లు తాజా టాక్. బిగ్ బాస్ తెలుగు 6ను జూలై 31వ తేది లేదా ఆగష్టు 7న మొదలు పెట్టాలనీ చూస్తోందట టీమ్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.