మార్చ్ 26న మొదలైన బిగ్ బాస్ ఓటిటి తెలుగు అప్పుడే మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు వారాల నుంచి బాగానే ఆకట్టుకుంటుంది ఈ షో. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కంటే ఈ ఓటిటి బిగ్ బాస్ కాస్త తక్కువగానే ఆదరణ దక్కించుకుంటుంది. కానీ కొందరు కంటెస్టెంట్స్ మాత్రం తమదైన ఆటతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అందులో బిందు మాధవి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఆటతీరు అందర్నీ కట్టి పడేస్తుంది. డిఫెరెంట్ గేమ్ ప్లాన్‌తో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడం.. ముందు నుంచి క్రేజ్ ఉండటం కూడా బిందుకు కలిసొచ్చే అంశం. తనకున్న ఇమేజ్ పాడు చేసుకోకుండా ఇంకా పెంచుకుంటుంది ఈ భామ. బిగ్ బాస్ అంటే అశ్లీలత ఎక్కువగా ఉంటుందనే విమర్శలు వస్తున్న వేళ.. చక్కటి డ్రెస్సింగ్‌తో అందర్నీ మాయ చేస్తుంది. తెలుగమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది.. ఉండాలి అంటూ బిందు మాధవి డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి.
అలాగే ఇంట్లో అందరితోనూ బాగుంటూ.. మంచి ఆటతీరుతో ముందుకు వెళ్తుంది బిందు. ఎప్పటికప్పుడు తన గేమ్ మార్చుకుంటూ ఇంటికి అనుగుణంగా ఆడుతుంది ఈ బ్యూటీ. తన ఆలోచనా విధానంతో మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ భామ. మొదటి వారం అంతంతమాత్రంగానే ఉన్న బిందు మాధవి.. రెండో వారం మాత్రం గేమ్ మార్చేసింది. టాస్క్‌లతో పాటు ఇంట్లో కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. నామినేషన్ సమయంలోనూ తన సత్తా చూపించింది. ఎందుకు నామినేట్ చేస్తున్నానే విషయంపై పూర్తి క్లారిటీ ఉంది.
ఈ వారం నామినేషన్స్‌లో అందరిదీ ఒక ఎత్తు నామినేషన్స్ అయితే బిందు మాధవి నామినేషన్ మాత్రం మరొక విధంగా జరిగింది. ఈ అమ్మాయి పద్దతి నాకు అర్థం కాదంటూ మొదట తేజస్వినిని నామినేట్ చేసింది. తను చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు అని కౌంటర్ ఇచ్చేసింది. ఆ తర్వాత అఖిల్ విషయంలోనూ బిందు మాధవి చుక్కలు చూపించింది. అన్నం పెట్టేవాళ్లు బేసిక్ సెన్స్ తెలుసుకోవాలి అంటూ అందరికీ చురకలు అంటించింది బిందు మాధవి. ఓడిపోతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని.. అనవసరంగా నిందలు వేస్తున్నారని కూడా సీరియస్ అయింది. మొత్తానికి సెకండ్ వీక్‌లో విశ్వరూపం చూపించింది బిందు మాధవి. ఈ సారి నామినేషన్స్‌లో ఈమె కూడా ఉంది. కానీ కచ్చితంగా సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.