Home /News /movies /

BIMBISARA NANDAMURI KALYAN RAM BIMBISARA NEW TRAILER RELEASED TA

Bimbisara New Trailer : ‘బింబిసార’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. కళ్యాణ్ రామ్ ఎలా ఉన్నాడంటే..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

Kalyan Ram As Bimbisara Pre Release Event   | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  Kalyan Ram As Bimbisara Pre Release Event   | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈయన  సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌కు అసలు  సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే  హీరోల్లో  క‌ల్యాణ్‌రామ్‌ (Kalyan Ram ) ఒకరు. ఇతను హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా  నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) .  ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు.

  ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ట్రైలర్‌‌తో పాటు లిరికల్ పాటలను విడుదల చేస్తే మంచి  మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  తాజాగా ఈ సినిమా  నుంచి  కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్  విడుదల చేశారు. ఇక ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 29న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో  నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్టు సమాచారం.  ఈ కొత్త ట్రైలర్‌లో హద్దులను చెరిపేస్తూ.. రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష... ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు.రాక్షసులు ఎరగని రావణ రూపం. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు  ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి.బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. వారి ఆటలను బింబిసారుడుగా మళ్లీ  జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా అంతం చేసాడనేదే ఈ సినిమాగా కనబడుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ గెటప్ బాగుంది.  ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటోందో అని డైలాగులు పేలాయి.   ‘ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న  సినిమా ‘బింబిసార’.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్.

  Tollywood: అగ్రహీరోలతో దిల్ రాజు భేటీ.. రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ఎన్టీఆర్, చరణ్,బన్ని అంగీకారం..


  ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, Tollywood

  తదుపరి వార్తలు