హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Billa 4K Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ 4K స్పెషల్ ట్రైలర్ విడుదల..

Prabhas - Billa 4K Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ 4K స్పెషల్ ట్రైలర్ విడుదల..

ప్రభాస్ ‘బిల్లా’ స్పెషల్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

ప్రభాస్ ‘బిల్లా’ స్పెషల్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Krishnam Raju - Prabhas - Billa Special Trailer Released | ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు రాగా.. ఇక ఈ లీగ్‌లోకి ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా స్పెషల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Krishnam Raju - Prabhas - Billa Special Trailer Released |  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మువీగా మిగిలిపోయింది బిల్లా. హై క్లాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ఈ మూవీ అంటే ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. భారతీయ తెర మీద స్టైలిష్ ఫిల్మ్ అని పేరు తెచ్చుకున్న బిల్లా సినిమా డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర స్పెషల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.రీ రిలీజ్ ను ఎయిమ్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. బిల్లా థీమ్ సాంగ్ నేపథ్యంగా సాగే ఈ ట్రైలర్ కృష్ణంరాజు  పోర్షన్ తో ప్రారంభమైంది. ఆయనకు నివాళిగా ట్రైలర్ లో కృష్ణంరాజు గారి పోర్షన్స్ పెట్టారు.

ప్రభాస్ చేసిన హై ఎండ్ యాక్షన్ సీన్స్ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చాయి. ఇవన్నీ ప్రభాస్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ కానున్నాయి. బిల్లా 4కె దేశవ్యాప్తంగానే కాదు యూఎస్ లోనూ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యూఎస్ లో అత్యధిక స్క్రీన్స్ తో రిలీజ్ చేస్తున్నారు.

ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు రాగా.. ఇక ఈ లీగ్‌లోకి ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా యూఎస్‌లో రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు. అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో ప్రభాస్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగా ప్రదర్శించనున్నారు.

ప్రభాస్ బిల్లా చిత్రాన్ని యూఎస్‌లో ఎంపిక చేసిన 70 పైగా లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. ఒక రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాపై అభిమానులు ఇప్పటి నుంచే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది. రీసెంట్‌గా బిల్లాకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కృష్ణంరాజు, ప్రభాస్ ‘బిల్లా’ స్పెషల్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

ఈ ప్రోగ్రామ్‌లో  సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్ఫణలో తెరకెక్కింది.

ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ మూవీకి రీమేక్. ఈ సినిమాను అప్పట్లో అన్న ఎన్టీఆర్ కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ‘యుగంధర్’ మూవీగా రీమేక్‌గా చేసారు. అటు రజినీకాంత్.. ‘బిల్లా’ పేరుతో తమిళంలో రీమేక్ చేయడం విశేషం. అటు చాలా యేళ్ల తర్వాత హిందీలో షారుఖ్ ఖాన్ ‘డాన్’ పేరుతో రీమేక్ చేయడం విశేషం. అటు తమిళంలో అజిత్ .. ఈ చిత్రాన్ని ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేసాడు. ఇక తెలుగులో ప్రభాస్ తొలిసారి పెదనాన్న కృష్ణంరాజు తో కలిసి ’డాన్’ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో రీమేక్ చేయడం చేశారు. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. మరి రీ రిలీజ్‌లో ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాల.ి

First published:

Tags: Anushka Shetty, Krishnam Raju, Prabhas, Tollywood

ఉత్తమ కథలు