సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో సల్మాన్, కరణ్, ఆలియాలకు బిహార్ కోర్టులో ఊరట..

సుశాంత్, సల్మాన్, ఆలియా, కరణ్ జోహార్ (File/Photos)

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడాన్ని మాములు జనాలతో పాటు సినీ అభిమానులు చాలా  మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు సల్మాన్, కరణ్ జోహార్‌తో పాటు పలువురు కారణం అంటూ ఓ వ్యక్తి బిహార్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  • Share this:
    ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడాన్ని మాములు జనాలతో పాటు సినీ అభిమానులు చాలా  మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలే కారణం అని ప్రముఖ నటులతో పాటు ఆయన అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారసత్వం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా కరణ్ జోహార్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల  కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సల్మాన్, ఆలియా, కరణ్  జోహార్‌లను ఏకి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్‌తో పాటు ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ పై సుధీర్ కుమార్ ఓజా అనే లాయర్ బిహార్ కోర్టులో కేసు నమోదు చేసాడు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చినపుడు అక్కడ స్థానిక బిహార్ మేజిస్ట్రేట్ ముఖేష్ కుమార్ ఈ పిటిషన్‌ను కొట్టిపాడేసారు. దీనినై సుధీర్ ఓజా.. ఈ కేసును జిల్లా కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. మంచి వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఎంత దూరమైన వెళతాని చెప్పుకొచ్చాడు ఆయన.ఇప్పటికే బిహార్‌కు చెందిన సినీ అభిమానులు సల్మాన్ ఖాన్, ఆలియా భట్, కరణ్ జోహార్ సినిమాలను విడుదల కానీయబోమని చెప్పిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: