news18-telugu
Updated: October 25, 2019, 7:46 AM IST
Twitter
Bigil Twitter Review : విజయ్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 'బిగిల్'. దిన్నే తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేస్తున్నారు. లేడి సూపర్ స్టార్ నయనతార విజయ్ సరసన నటించింది. అయితే తెరీ, మెర్సల్ తర్వాత బిగిల్ రావడంతో అంతులేని అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బిగిల్ ట్రైలర్ కూడా అదరగొట్టింది. ఒలంపిక్స్ నేపథ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా కనిపిస్తున్నారు. దీనికి తోడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో అదిరిపోయింది మొన్న విడుదలైన ట్రైలర్. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్, నయన్‌తో పాటు మిగితా పాత్రల్లో.. వివేక్, యోగిబాబు, డేనియల్ బాలాజీ ఈ నటిస్తున్నారు.
తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ నటించిన.. అదిరింది, సర్కార్ సినిమాల తర్వాత తెలుగులో విజయ్ మార్కెట్ బాగానే పెరిగింది. మరి ఈ ‘విజిల్’తో విజయ్ తెలుగులో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విజిల్ వేస్తాడా లేదా అనేది చూడాలి.. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ సినిమాను అల్రేడి చూసిన ఓవర్సీస్ ప్రేక్షకుల సినిమా గురించి ఏమంటున్నారు. అట్లీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా.. అసలు కథేంటీ.. విజయ్‌కు మరో సారి బ్లాక్ బస్టర్ దొరికిందా.. అసలు ఓవర్సీస్ ప్రేక్షకులు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం..
నయనతార హాట్ పిక్స్...
Published by:
Suresh Rachamalla
First published:
October 25, 2019, 7:32 AM IST