Hyper Aadi Varshini: హైపర్ ఆది, వర్షిణి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. ఆది బాటిల్ విసిరేసాడా..?

హైపర్ ఆది వర్షిణి (hyper aadi varshini)

Hyper Aadi Varshini: అవునా.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా.. పైగా ఇప్పుడు హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా..! ఒరేయ్ ఒసేయ్ అనుకునే సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది. అలాంటిది మరి ఎందుకు గొడవ పడతారు..

  • Share this:
అవునా.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా.. పైగా ఇప్పుడు హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా..! ఒరేయ్ ఒసేయ్ అనుకునే సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉంది. అలాంటిది మరి ఎందుకు గొడవ పడతారు.. పైగా ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఆది అంత హైపర్ ఎందుకయ్యాడబ్బా అనుకుంటున్నారా..? అవును నిజంగానే ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో కోక్ బాటిల్ కూడా విసిరేసాడు ఆది. స్వయంగా వాళ్లిద్దరే ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం గొడవ పడ్డామని.. ఒకరిపై ఒకరు అరుచుకున్నామని చెప్పారు. దానికి సంబంధించిన కారణాలు కూడా చెప్పుకొచ్చారు ఆది, వర్షిణి. గత సీజన్ వరకు ఈ ఇద్దరూ ఢీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌కు టీం లీడర్స్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో మాత్రం వర్షిణిని పక్కనబెట్టి దీపిక పిల్లైను తీసుకున్నారు. వీళ్లు కూడా స్టేజీపై ఫుల్ కామెడీ కూడా చేస్తుంటారు. పక్కనే రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ లాంటి జంట ఉండటంతో వాళ్లను తట్టుకోడానికి వీళ్లు కూడా బాగానే రొమాన్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఆది, వర్షిణి కెమిస్ట్రీ చూసి సుధీర్, రష్మి కూడా షాక్ అవుతుంటారు. అంతగా కలిసిపోయారు స్క్రీన్‌పై ఈ ఇద్దరూ.

hyper aadi varshini war,hyper aadi varshini war in australia,hyper aadi varshini dance latest,hyper aadi varshini love story,hyper aadi varshini,hyper aadi varshini romance,hyper aadi funny comments on varshini,hyper aadi hilarious punch to anchor varshini,hyper aadi varshini love,hyper aadi jabardasth,hyper aadi and varshini performance,హైపర్ ఆది వర్షిణి,జబర్దస్త్ హైపర్ ఆది వర్షిణి వార్,హైపర్ ఆది వర్షిణి ఆస్ట్రేలియాలో గొడవ
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


అలాంటి ఈ జోడీ ఓసారి చాలా దారుణంగా గొడవ పడ్డారు. ఇది ఇప్పుడు జరిగింది కాదు.. కొన్నేళ్ల కింద జరిగింది. ఢీ చాంపియన్స్‌కు ఈ ఇద్దరూ రాకముందు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జబర్దస్త్ కామెడీ షో నుంచి పాపులర్ అయిన ఆది.. ఆస్ట్రేలియాకు ఓ ఈవెంట్ కోసం వెళ్లాడు. ఆ ఈవెంట్‌కు వర్షిణి కూడా వచ్చింది. అయితే వాళ్లిద్దరికి అప్పటికి అంత బాగా పరిచయం లేదు. ఏదో హాయ్ అంటే హాయ్ అంతే. ఆ సమయంలో అంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని జోకులు వేసుకుంటున్నపుడు ఆదిపై కాస్త సెటైర్లు వేసింది వర్షిణి.

hyper aadi varshini war,hyper aadi varshini war in australia,hyper aadi varshini dance latest,hyper aadi varshini love story,hyper aadi varshini,hyper aadi varshini romance,hyper aadi funny comments on varshini,hyper aadi hilarious punch to anchor varshini,hyper aadi varshini love,hyper aadi jabardasth,hyper aadi and varshini performance,హైపర్ ఆది వర్షిణి,జబర్దస్త్ హైపర్ ఆది వర్షిణి వార్,హైపర్ ఆది వర్షిణి ఆస్ట్రేలియాలో గొడవ
హైపర్ ఆది, వర్షిణి (Image: Youtube)


అప్పటికి తనతో అంతగా పరిచయం లేని అమ్మాయి.. అందరి ముందు అలా సెటైర్లు వేసేసరికి అంతగా తీసుకోలేకపోయాడు హైపర్ ఆది. పైగా అంతమంది ముందు తనను అలా అంటుంటే టెంపర్ కూడా లాస్ అయిపోయానని చెప్పాడు ఆది. దాంతో వెంటనే చేతిలో ఉన్న కోక్ బాటిల్ అలా పక్కకు విసిరేసి ఫుల్లుగా అరిచేసానని చెప్పాడు హైపర్ ఆది. తనకు అంత కోపం వస్తుందని అప్పటి వరకు ఎవరికీ తెలియదని.. నిజానికి తనకు కూడా అది కొత్తే అని గుర్తు చేసుకున్నాడు ఈయన. వర్షిణి కూడా అదే స్థాయిలో అరిచేసిందని చెప్పాడు. ఆ వెంటనే మమ్మీ అంటూ ఏడ్చేసి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు.

hyper aadi varshini war,hyper aadi varshini war in australia,hyper aadi varshini dance latest,hyper aadi varshini love story,hyper aadi varshini,hyper aadi varshini romance,hyper aadi funny comments on varshini,hyper aadi hilarious punch to anchor varshini,hyper aadi varshini love,hyper aadi jabardasth,hyper aadi and varshini performance,హైపర్ ఆది వర్షిణి,జబర్దస్త్ హైపర్ ఆది వర్షిణి వార్,హైపర్ ఆది వర్షిణి ఆస్ట్రేలియాలో గొడవ
హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)


ఆ సీన్ అక్కడితో అయిపోయిన తర్వాత ఎక్కడైనా సెట్స్‌లో కనిపించినపుడు కూడా ఆది పలకరించినా కూడా పెద్దగా పట్టించుకునే వాడు కాదని చెప్పింది వర్షిణి. ఆ తర్వాత ఢీ ఛాంపియన్స్‌లో అవకాశం వచ్చిందని.. అక్కడే ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయామని అసలు విషయం చెప్పింది. ఆస్ట్రేలియాలో చిన్న మిస్ అండర్ స్టాడింగ్‌తోనే గొడవ పడ్డామని.. ఆ తర్వాత వర్షిణి తీరు అలాగే ఉంటుందని తెలిసి సారీ కూడా చెప్పినట్లు తెలిపాడు హైపర్ ఆది. ఇప్పుడు తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంటున్నాడు ఈయన. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటామని చెప్పారు ఆది, వర్షిణి.
Published by:Praveen Kumar Vadla
First published: