BiggBossTelugu3: కిచెన్‌లో రచ్చ...గుడ్లను నేలకేసి కొట్టిన హిమజ

హిమజకు పట్టలేనంత కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఆమ్లెట్‌ను ప్లేట్‌తో సహా విసిరేస్తుంది. అంతటితో ఆగకుండా కిచెన్‌లోకి వెళ్లి గుడ్లలన్నింటినీ పగులకొట్టింది. తనను తినకుండా చేసినందుకు...ఇంట్లో కూడా ఎవరూ తినకూడదని గట్టిగా అరిచేస్తుంది.

news18-telugu
Updated: August 23, 2019, 11:09 AM IST
BiggBossTelugu3: కిచెన్‌లో రచ్చ...గుడ్లను నేలకేసి కొట్టిన హిమజ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 23, 2019, 11:09 AM IST
BiggBossTelugu3: బిగ్‌బాస్ హౌజ్‌లో రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అలీ రెజా, మహేశ్ విట్టాకు అస్సలు పొసగడం లేదు. ఇరువురి మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతోంది. వారిని కంట్రోల్ చేయడం ఇంటి కెప్టెన్ శివజ్యోతితో పాటు ఇతర సభ్యుల వల్ల కూడా కావడం లేదు. వీరి ఫైట్ ఇలా ఉంటే.. మరోవైపు శుక్రవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో మరింత హాట్‌ హాట్‌గా ఉంది. హిమజ ఆమ్లెట్ తింటున్న క్రమంలో బాబా భాస్కర్‌తో పాటు కొందరు ఇంటి సభ్యులు ఆమెపై కామెంట్స్ చేస్తారు. దాంతో హిమజకు పట్టలేనంత కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఆమ్లెట్‌ను ప్లేట్‌తో సహా విసిరేస్తుంది. అంతటితో ఆగకుండా కిచెన్‌లోకి వెళ్లి గుడ్లలన్నింటినీ పగులకొట్టింది. ఎగ్స్ ట్రేను అమాంతం ఎత్తి నేలకేసి కొడుతుంది. తనను తినకుండా చేసినందుకు...ఇంట్లో కూడా ఎవరూ తినకూడదని గట్టిగా అరిచేస్తుంది. మరి హిమజ నిజంగానే కోపంలో ఇలా చేసిందా.? లేదంటే బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడా? అన్నది శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో తెలియనుంది.






First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...