హోమ్ /వార్తలు /సినిమా /

BiggBoss Telugu 4: కెప్టెన్ రేస్‌లో గంగవ్వ.. కుర్రాళ్లను ఓడిస్తుందా..?

BiggBoss Telugu 4: కెప్టెన్ రేస్‌లో గంగవ్వ.. కుర్రాళ్లను ఓడిస్తుందా..?

గంగవ్వ (Twitter: StarMaa)

గంగవ్వ (Twitter: StarMaa)

ఇవాళ హౌస్‌మేట్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సభ్యుడిని ఇంటిలోకి పంపిస్తున్నారు.

BiggBoss Telugu4: బిగ్ బాస్ షో రోజు రోజుకూ ఆసక్తిగా మారుతోంది.  ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత.. ఆ పోటీని తట్టుకునేందుకు దూకుడు పెంచాడు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్‌కు అద్భుతమైన టాస్క్స్‌ ఇచ్చి. . ఇంట్లో  సెగలురేపుతూ.. బయటి  ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. నిన్న మొన్న జరిగిన 'ఉక్కు హృదయం; టాస్క్‌ రసవత్తరంగా జరిగింది. రోబోలు, హ్యూమన్స్‌గా విడిపోయిన సభ్యులు గేమ్‌లో లీనమయ్యి.. ఆకట్టుకున్నారు.  మనుషుల ఆవేశం.. రోబోల ప్రశాంతం.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రోబో జట్టు మైండ్ గేమ్ ఆడి హ్యూమన్స్‌పై విజయం సాధించారు.

ఇక హ్యూమన్స్ జట్టులో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన నోయెల్‌ను బిగ్ బాస్.. జైల్లో పెట్టాడు. అతడికి రాగి జావ, పళ్లు తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలు, పానీయాలు ఇవ్వకూడదని హౌస్ సభ్యులను ఆదేశించాడు. విజేతగా నిలిచిన రోబో జట్టులో ముగ్గురు అద్భుత ప్రదర్శన చేసినట్లు మిగతా సభ్యులు చెబుతారు. వారే అభిజీత్, అవినాష్, గంగవ్వ, హారిక..! ఈ నలుగురిలో ఒకరు కెప్టెన్‌గా ఎంపికవుతారు. దానికి సంబంధించిన టాస్క్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 'రంగు పడుద్ది.. జాగ్రత్త' పేరుతో ఈ టాస్క్‌ ఇవాళ జరగబోతోంది. బిగ్ బాస్ కెప్టెన్ పదవి కోసం కుర్రాళ్లు అభిజీత్, అవినాష్, హారికతో తలపడుతోంది గంగవ్వ. మరి వారిని ఓడించి కెప్టెన్‌గా ఎంపికవుతుందా? లేదా? తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


ఇక ఇవాళ హౌస్‌మేట్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సభ్యుడిని ఇంటిలోకి పంపిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా విడుదలయింది. అందులో ఆమె ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు. ఐతే స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద సినిమాల్లో స్వాతి దీక్షిత్ హీరోయిన్‌గా నటించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇప్పటి వరకు మొదట కుమార్ సాయి, ఆ తర్వాత అవినాష్ ఇంట్లోకి వెళ్లారు.


కాగా, బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం నోయెల్, అభిజిత్, కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్, సోహైల్, మెహబూబ్, అఖిల్, మోనాల్, దివి, గంగవ్వ, అరియానా, లాస్య, సుజాత, హారిక, దేవి నాగవల్లి ఉన్నారు. అంటే ప్రస్తుతం 16 మంది సభ్యులు ఉన్నారు. మొదటి వారం తర్వాత సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం తర్వాత కరాటె కళ్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరి ఈ వారం ఎవరు వెళ్లిపోతారన్నది చర్చనీయాంశమైంది. మొత్తం ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. కుమార్ సాయి, మెహబూబ్, హారిక, దేవి నాగవల్లి, అరియానా, మోనాల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈవారం హౌస్ నుంచి వెళ్లిపోతారో చూడాలి.

First published:

Tags: Bigg Boss, Bigg Boss 4 Telugu, Gangavva, Tollywood

ఉత్తమ కథలు