తెలుగులో బిగ్‌బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో తెలుగులో ఎంత ఆదరణ దక్కించుకుందంటే ఈ షో ధాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతలా ఆకట్టుకుంది. పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్‌లు తమ యాంకరింగ్‌తో సందడి చేశారు. అయితే కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన సన్నాహాలు, హాడావిడి జరుగుతుండేది. గత మూడు సీజన్లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ఉండేవి. అయితే తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 4పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా లోగో ప్రోమోని విడుదల చేసిన స్టార్ మా.. షో ఉంటుందనేలా క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజా సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అందులో భాగంగా ఆయన ఈ షోకి రెడీ అవుతున్నట్లుగా కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ని కూడా అల్రెడీ సెలక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఈ షోలో ఇద్దరు హాట్ యాంకర్స్ పాల్గొనబోతున్నారనే వార్త మరింతగా హాట్‌గా మారింది.
మంజూష, విష్ణుప్రియ Photo : facebook
టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలు ఈ షోలో పాల్గొనబోతున్నారట. నిజంగా ఈ ఇద్దరూ ఈ షోలో ఉంటే మాత్రం గ్లామర్ పరంగా ఈ షో హిట్ అయినట్లే. ఎందుకంటే విష్ణుప్రియ అల్రెడీ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. మంజూష గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఇద్దరితో పాటు నందు, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి. చూడాలి మరి ఈ లిస్ట్‌లో ఎంతమంది బిగ్ బాస్ హౌజ్‌లో ఉండనున్నారో..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.