హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక‌తో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్..

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరైయాడు.

news18-telugu
Updated: December 15, 2019, 10:40 AM IST
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక‌తో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్..
Twitter
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరైయాడు. రాహుల్‌కు  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రాహుల్ ఆ మధ్య తన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.  డైరెక్టర్ కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , కమెడియన్ బ్రహ్మనందంలు నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో  హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడ నటిస్తోంది. శివాత్మిక 'దొరసాని' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న ఆమె, కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం.  శివాత్మిక ఈ సినిమాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు  జోడీగా నటించనున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవలే దర్శకుడు వంశీ చిత్రీకరించినట్టు చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.




పాయల్ రాజ్‌పుత్ ఎంత క్యూటో... అదిరిన లేటెస్ట్ పిక్స్..
Published by: Suresh Rachamalla
First published: December 15, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading