BiggBoss3: బిగ్‌బాస్‌‌కు సీరియస్ వార్నింగ్..కంటెస్టెంట్‌పై కేసు నమోదు

BiggBoss3 | బిగ్‌బాస్ ఆర్గనైజర టీనాకు ఫోన్‌ కాల్ చేసి..డబ్బు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చిందట.

news18-telugu
Updated: August 22, 2019, 4:21 PM IST
BiggBoss3: బిగ్‌బాస్‌‌కు సీరియస్ వార్నింగ్..కంటెస్టెంట్‌పై కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 22, 2019, 4:21 PM IST
బిగ్‌బాస్ రియాల్టీ షో..! కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్..! దేశంలో దాదాపు అన్ని భాషల్లో టెలికాస్ట్ అవుతోంది. ఐతే తమిళ్‌ బిగ్‌బాస్‌పై జరుగుతున్నంత రచ్చ మరెక్కడా జరగడం లేదు. బిగ్‌బాస్ సెట్లోకి పోలీసులు వెళ్లడం, ఓ కంటెస్టెంట్ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ రియాల్టీ షోపై తీవ్ర దుమారం రేగుతోంది. తాజా మరోసారి పోలీస్ స్టేషన్‌ దాకా వెళ్లింది తమిళ్ బిగ్‌బాస్ వ్యవహారం..! ఐతే ఈసారి రివర్స్‌లో జరిగింది. బిగ్‌బాస్ నిర్వాహకులే కంటెస్టెంట్‌పై కేసుపెట్టారు.


ఇటీవల నటి మధుమిత తమిళ్‌ బిగ్‌బాస్‌ సెట్లో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను షో నుంచి తొలగించారు. ఐతే తనకు రావాల్సిన పారితోషికాన్ని ఇవ్వాలని మధుమిత బిగ్‌బాస్ నిర్వాహకులను బెదిరించిందట. బిగ్‌బాస్ ఆర్గనైజర టీనాకు ఫోన్‌ కాల్ చేసి..డబ్బు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు వాట్సాప్ సందేశాలు కూడా పంపించిందట. దాంతో స్టార్ విజయ్ టీవీ ఛానెల్ లీగల్ డిపార్ట్‌మెంట్ మేనేజర్‌ ప్రసాద్‌ పోలీసులను ఆశ్రయించారు.



ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న మధుమితపై చర్యలు తీసుకోవాలని గుండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రసాద్.. మధుమిత బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒప్పందం ప్రకారం రూ.11.5 లక్షల పారితోషికం ఇచ్చామని చెప్పారు. మిగతా బకాయిలు రూ.80 వేలను రెండు రోజుల్లో చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మధుమతి బెదిరించినట్లు తెలిపారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పష్టంచేశారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...