సూపర్‌స్టార్ మహేశ్ ఇటీవల తన 27వ సినిమా 'సర్కారు వారి పాట' షూటింగ్‌ను దుబాయ్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముందు యు.ఎస్‌లో చిత్రీకరించాల్సిన షెడ్యూల్‌ను కోవిడ్ ప్రభావంతో దుబాయ్‌కు మార్చారు. కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌కు ఆస్కారం ఉంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేల డాన్స్ చేస్తుందని నిన్నా మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మరో సొగసరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంతకీ అందాలను ఆరబోయడంలో వెనుకాడని ఊర్వశి రౌతేలాకు షాకిస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? మొనాల్ గజ్జర్. ఐదారు చిన్నా చితక సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్‌కు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ 4 హౌస్‌లో అభిజిత్, అఖిల్‌తో నడిపిన లవ్‌ట్రాక్ ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చింది. బిగ్‌బాస్ 4 హౌస్‌లో ఫైనల్ ముందు వరకు ఈమె కొనసాగడానికి ఈ లవ్‌ట్రాక్ ఎంతగానో సపోర్ట్ చేసింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్‌కు ఇటు టీవీ, అటు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల అల్లుడు అదుర్స్‌లోనూ మోనాల్ గజ్జర్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. కేవలం ఓసాంగ్లో నటించినందుకే ఈ అమ్మడుకి పదిహేను లక్షల రూపాయలు రెమ్యునరేషన్‌గా దక్కింది. ఇప్పుడు అదే ఊపుతో సూపర్‌స్టార్ మహేశ్ 'సర్కారువారిపాట' చిత్రంలోనూ ఊర్వశి రౌతేలా ప్లేస్‌ను రీప్లేస్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్ 4వల్ల వచ్చిన క్రేజ్ మోనాల్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ సినిమాలో అవకాశాన్ని అందివచ్చేలా చేసిందనాలి.

Bigg Boss4 beauty Monal Gajjar Special song in Super Star Mahesh Sarkaru Vaari Paata
సర్కారువారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విలన్‌ను హీరో ఇండియాకు తిరిగి ఎలా రప్పించాడనే పాయింట్‌తో సినిమా రూపొందిందని వార్తలు వినిపిస్తున్నాయి.