బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ(Sunny) హీరోగా కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డైమండ్ రత్నబాబు (Daimond Ratnababu) ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రంజిత్ రావ్. బి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేడు (మంగళవారం) హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్రానికి అన్‌స్టాపబుల్ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) (Unstoppable) అనే టైటిల్ పెట్టారు.
సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం ఇప్పుడు టాలీవుడ్‌లో (Tollywood) హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సన్నీ.. వీజేగా మారి.. సీనియల్స్‌లో యాక్టర్‌గా రాణించి ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్-౫ (Bigg Boss Season 5) విన్నర్‌గా నిలిచి పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక సినిమాలు చేస్తున్నాడు సన్నీ. 'సకల గుణాభిరామ' సినిమాలో హీరోగా నటించిన సన్నీ.. ఇప్పుడు రత్నబాబుతో న్యూ మూవీ చేస్తున్నాడు.
ఈ అన్‌స్టాపబుల్ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) సన్నీ సరసన హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. జూన్ 9 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జులై నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని, దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని డైమండ్ రత్నబాబు చెప్పారు. కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నానని, బిగ్ బాస్ తర్వాత నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నానని సన్నీ అన్నారు.
ఇకపోతే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో పలువురు సీనియర్ నటులు భాగం కాబోతున్నారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss