ఆ ముగ్గరు లేకపోతే లోకమే లేదు...బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ భావోద్వేగం..

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ 3లో విజేతగా నిలిచి సంచలనం  సృష్టించాడు హైదరాబాదీ పాతబస్తీ యువకుడు రాహుల్ సిప్లిగంజ్. తాజాగా ఈయన తన జీవితంలో వాళ్ల ముగ్గురి ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చాడు.

news18-telugu
Updated: May 12, 2020, 8:06 PM IST
ఆ ముగ్గరు లేకపోతే లోకమే లేదు...బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ భావోద్వేగం..
రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj)
  • Share this:
తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ 3లో విజేతగా నిలిచి సంచలనం  సృష్టించాడు హైదరాబాదీ పాతబస్తీ యువకుడు రాహుల్ సిప్లిగంజ్.  బిగ్‌బాస్ షోలో అతని నిజాయితీ, ముక్కుసూటి తనంతో ఆకట్టుకొని విజేతగా నిలిచి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో తన తోటి కంటెస్టెంట్ పునర్నవితో ప్రేమాయణం ఇతనికి బాగానే కలిసొచ్చింది. అంతకు ముందు ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటల పాడినా రాని పేరు బిగ్‌బాస్‌తో వచ్చింది. అయితే ఆ మధ్య రాహుల్ సిప్లిగంజ్‌పై ఓ పబ్‌లో దాడి జరిగిన ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇపుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగ మార్తాండ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ.. తన దృష్టిలో కటింగ్ చేసేవారు, బట్టలు కుట్టేవాళ్లు,  బట్టలు ఉతికే వారు లేకపోతే ఈ లోకమే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. బార్బర్ అనేది ఓ కళ.. అవతలి వారిని అందంగా తయారు చేయడం అంతా ఈజీ కాదున్నారు. తన జీవితంలో ఎప్పటికైనా ఓ వృద్దాశ్రమం కట్టాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఓ స్టేజ్‌ దాటాకా ఇక చాలు అనిపిస్తుంది కదా. అపుడు ఈ పని చేస్తాననన్నాడు. కొంత మంది రాహుల్.. వృద్ధాశ్రయంపై సెటైర్లు వేస్తున్నారు. అసలు అందరు తమ తల్లి తండ్రులను వృద్దాశ్రమాల్లో చేర్పించకుండా తమ దగ్గర ప్రేమతో చూసుకునే రోజు రావాలన్నారు. మొత్తానికి రాహుల్ తన జీవితంలో ఏదైతే చేయాలనకున్నాడో అది చేయాలని కోరకుందాం..
Published by: Kiran Kumar Thanjavur
First published: May 12, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading