సోషల్ మీడియాను ఊపేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ కొత్త పాట

Rahul Sipligunj: ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో రెండు మిలియన్ల వ్యూస్ దాటడంతో తన అభిమానులకు థాంక్స్ చెబుతూ ఫేస్‌బుక్‌ల పోస్టు పెట్టాడు.

news18-telugu
Updated: November 20, 2019, 4:57 PM IST
సోషల్ మీడియాను ఊపేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ కొత్త పాట
Instagram/sipligunjrahul
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్... బిగ్ బాస్ షోతో... అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి అందర్నీ ఆకట్టుకున్నాడు. పునర్నవితో ప్రేమ వ్యవహారం అంటూ... నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారాడు. బిగ్ బాస్ షోకు ముందు అనేక పాటలు పాడిన పాప్ సింగర్ అయిన రాహుల్...తన గాత్రంతో అందరిని అలరించాడు. తాజాగా బిగ్ బాస్ షో ముగిశాక... రాహుల్ పాడిన కొత్త పాటలు ఇప్పుడు అభిమానుల్ని మరింత ఆకట్టుకుంటున్నాయి. అమెరికాపోయి నువ్వైతావ్ రా లంగా.. మాకేమో బెంగా.. అంటూ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఆయన పాడిన ‘ప్రెజర్ కుక్కర్’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘నువ్వైతావ్ రా లంగా’ పాట రెండు మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పాట ప్రజర్ కుక్కర్ సినిమా కోసం పాడిన పాటన రాహుల్ తెలపాడు. ఈ సినిమాలో తాను రెండు పాటల్ని కంపోజ్ చేశాడన్నారు. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో రెండు మిలియన్ల వ్యూస్ దాటడంతో తన అభిమానులకు థాంక్స్ చెబుతూ ఫేస్‌బుక్‌ల పోస్టు పెట్టాడు.First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>