హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్‌పై రాహుల్ సిప్లిగంజ్ వెకిలి మాటలు.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం

సుడిగాలి సుధీర్‌పై రాహుల్ సిప్లిగంజ్ వెకిలి మాటలు.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం

సుడిగాలి సుధీర్, రాహుల్ సిప్లిగంజ్ (Image:etvteluguindia)

సుడిగాలి సుధీర్, రాహుల్ సిప్లిగంజ్ (Image:etvteluguindia)

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సుధీర్‌ని సరదాగా తెలంగాణ యాసలో తిడతాడు. ఆ మాటలపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఢీతో పాటు పలు రియాల్టీ షోల వేదికపై నవ్వుల పువ్వులు పూయిస్తుంటాడు. ఇక రష్మీతో మనోడు వేసే వేషాలకు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్ ఉంటూ ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్‌లో కామెడీ, రష్మీతో రొమాన్స్ నేపథ్యంలో ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నాడు సుధీర్. అలాంటి సుధీర్‌పై బిగ్ బాస్ 2 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో యాసలో మనోడిని సరదాగా తిట్టడంతో సుధీర్ ఫ్యాన్స్ తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..

ప్రతి పండగకు ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్, ఢీ డాన్సర్స్‌తో స్పెషల్ ఈవెంట్లు చేస్తారు. ఎప్పటిలానే వినాయక చవితి సందర్భంగా '2020 అనుకున్నదొక్కటి అయ్యింది ఒకటి' పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ఆగస్టు 22న వినాయక చవితి సందర్భంగా ఆ షో ప్రసారమవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ప్రోమో విడుదలై యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఈ షోలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాంప్రసాద్, గెటప్ శ్రీను, రాహుల్ సిప్లిగంజ్, సునీల్, రోజా, శ్రీముఖి, పునర్నవి, హిమజ, రోహిణి సందడి చేశారు. కామెడీతో నవ్వులు పూయించి.. ఆటపాటలతో అలరించారు.

ఈ ప్రోమోలో అందరూ సుడిగాలి సుధీర్‌పై పంచ్‌లు వేశారు. ఓ సందర్భంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సుధీర్‌ని సరదాగా తెలంగాణ యాసలో తిడతాడు. ఆ మాటలపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సుధీర్ బుల్లితెర హీరో అని.. అలాంటి తమ స్టార్‌పై ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేయడం దారుణమని విరుచుకుపడుతున్నారు. కేవలం కామెడీ కోసం సుధీర్‌ని అన్ని మాటలంటారా అని విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ నువ్వెంత.. నీ స్థాయి ఎంతంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని కొందరు చెప్పినా వినడం లేదు. ఒకవేళ రాహుల్ కావాలని అనకున్నా.. డైరెక్షన్ ప్రకారమే అలా చేసినా.. ఎడిటింగ్‌లో ఆ వ్యాఖ్యలను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Hyper Aadi, Jabardasth, Punarnavi bhupalam, Rahul sipligunj, Sudigali sudheer

ఉత్తమ కథలు