ఫ్రస్ట్రేషన్‌లో బిగ్‌బాస్ కౌషల్...కోపం పట్టలేక ఏం చేశాడంటే...?

ఇప్పుడు బిగ్ బాస్ గా కొత్తగా అవతరించిన రాహుల్ రంగప్రవేశం చేయడంతో కౌషల్ ఆర్మీ పటాపంచలు అయిపోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Updated: November 14, 2019, 9:36 PM IST
ఫ్రస్ట్రేషన్‌లో బిగ్‌బాస్ కౌషల్...కోపం పట్టలేక ఏం చేశాడంటే...?
కౌశల్ మందా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో (Source: Instagram/ Kaushal Manda)
  • Share this:
బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్ అంటే ఓ సంచలనం అనే చెప్పవచ్చు. సంచలనంతో పాటు వివాదం కూడా కౌషల్ ఇంటిపేరుగా మారింది. బిగ్ బాస్ ఆడుతున్నప్పుడే అతడి పెర్ఫార్మెన్స్ కు కౌషల్ ఆర్మీ రూపంలో ఆదరణ లభించింది. అయితే బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన తర్వాత కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ మెయిన్ టేయిన్ చేయడంలో మాత్రం కౌషల్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యే వరకూ కౌషల్ ఒక సెలబ్రిటీ అనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ గా కొత్తగా అవతరించిన రాహుల్ రంగప్రవేశం చేయడంతో కౌషల్ ఆర్మీ పటాపంచలు అయిపోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ఎఫ్ 3 ప్రోగ్రామ్‌లో కౌషల్ తన ఫ్యామిలీతో సహా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్ లో కౌషల్ మొత్తం సరదాగా కనిపించినప్పటికీ, ఒక దశలో ఫ్రస్ట్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కౌషల్ ఆర్మీ మాత్రం అలాంటిదేమీ లేదని నెట్టింట వివరణలు ఇస్తున్నప్పటికీ, కౌషల్ మాత్రం ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నాడని మరికొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...