BIGG BOSS WINNER ABIJEET RESPOND ABOUT MEHBOOB SOHEL 25 LACKS CONTROVERSY PK
Bigg Boss Abijeet: మెహబూబ్, సోహెల్ సంగతి స్టార్ మా చూసుకుంటుంది.. అభిజీత్ హాట్ కామెంట్స్..
అభిజీత్ (Abijeet)
Bigg Boss Abijeet: బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయిన తర్వాత కూడా దాని గురించి చర్చలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చివరి వారంలో చాలా విచిత్రాలు జరిగాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు..
బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయిన తర్వాత కూడా దాని గురించి చర్చలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చివరి వారంలో చాలా విచిత్రాలు జరిగాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. అభిజీత్ టైటిల్ గెలవడం.. అఖిల్ రన్నరప్ కావడం.. సోహెల్ మూడోస్థానంలో ఉండి కూడా 40 లక్షలకు పైగా తీసుకెళ్లిపోయాడు. అయితే ఆయన గెలిచిన 25 లక్షల ప్రైజ్ మనీ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈయనకు తన స్నేహితుడు మెహబూబ్ హెల్ప్ చేయడం వల్లే ఆయన డబ్బులు తీసుకున్నాడని బయట ప్రచారం జరుగుతుంది. అందులో ఆయన కూడా కొన్ని లక్షలు తీసుకున్నాడని.. డబ్బు సాయం చేయాలి కాబట్టే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. వీటిపై సోహెల్ సీరియస్‌గానే స్పందించాడు. అలాంటివేం లేవని కొట్టి పారేసాడు. ఇప్పుడు ఇదే విషయంపై అభిజీత్ కూడా నోరు విప్పాడు. తాజా ఇంటర్వ్యూలో సోహెల్ విషయంపై చెప్పుకొచ్చాడు అభి. మెహబూబ్, సోహెల్ కలిసి మీకు రావాల్సిన 25 లక్షలు రాకుండా చేసారని బయట టాక్ వినిపిస్తుంది.. మీరేం అంటారు అభి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని చెప్పాడు. ఆ రోజు జరిగిన సీన్లో తాను లేనని.. అక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీ లేదని చెప్పాడు.
అభిజీాత్ (Abijeet/Twitter)
ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా జరిగితే స్టార్ మా వాళ్ల సంగతి చూసుకుంటుందని చెప్పాడు. అక్కడ జరిగిన దానిపై క్లారిటీ లేనపుడు మాట్లాడుకూడదని.. తనకు కూడా బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియోలు చూపించారని చెప్పాడు అభిజీత్. అక్కడికి తాను డబ్బుల కోసం వెళ్లలేదని చెప్పాడు అభిజీత్. తనకు గుర్తింపు కావాలని.. ఎనిమిదేళ్ల కింద లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా చేసినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని రావాల్సినంత గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను కానీ గుర్తింపు అలా రాదు కదా అంటున్నాడు ఈయన. ఏదేమైనా కూడా సోహెల్, మెహబూబ్ ఇష్యూ మాత్రం చాలా కూల్‌గా డీల్ చేసాడు అభిజీత్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.