Bigg Boss Winner Abhijeet: ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లోకల్లోలం సృష్టిస్తోంది.ఈ వేవ్‌లో చాలా మంది ఆక్సిజన్ అందక కళ్లు మూస్తున్నారు. రీసెంట్‌గా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కూడా కరోనాతోనే మరణించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో పాటు బాలీవుడ్ నటీనటులు కంగనా, అక్షయ్ కుమార్, ఆలియా వంటివాళ్లు కరోనా బారిన పడ్డారు. నిన్నటి నిన్న ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ .. తల్లికి కరోనా సోకిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలియజేసారు. ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. మా మదర్‌కు పాజటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. అమ్మకు సీటీ లెవల్స్ బాగున్నాయన్నారు.
అమ్మ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు అభిజిత్ మాట్లాడుతూ.. కోవిడ్ మనిషి మానసిక ఆరోగ్యానికి పరీక్ష పెడుతోంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది పెద్ద ట్రాష్. ఒక వ్యాధి సోకిని వారిని ఒక రూమ్‌లో బంధించడం అనేది దారుణమైన విషయం. మనం ఇపుడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ సమయంలో నేను మాత్రం స్పానిష్ భాషను నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు. త్వరలోనే అందరం ఈ విషయమ పరిస్థితి నుంచి బయట పడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.