Home /News /movies /

Abijeet: స్టార్ హీరోల‌తో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్‌ నిర్ణయం కరెక్టేనా?

Abijeet: స్టార్ హీరోల‌తో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్‌ నిర్ణయం కరెక్టేనా?

అభిజీత్

అభిజీత్

Abijeet - F3 Movie: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా చేస్తున్నఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

    లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్‌ ట్రెండ్‌ అవుతోంది. దీన్ని విన్నవాళ్లు ఇప్పటికే దాని గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... అభిజిత్‌ ఎఫ్‌3లో నటిస్తున్నారు. ఈ వార్తే కనుక నిజమైతే, అభిజిత్‌ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అది అతని కెరీర్‌కి హెల్ప్ అవుతుందా? కాదా? బిగ్‌బాస్‌లో విన్నర్‌లు, రన్నర్‌లు ఆ తర్వాత కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌ అయిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు. కానీ అందరూ అభిజిత్‌ అందుకు భిన్నం అనే నమ్మకంతోనే ఉన్నారు. ఆల్రెడీ లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అభిజిత్‌, ఇప్పుడు రీ ఎంట్రీ టైమ్‌లో దున్నేస్తారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే అభిజిత్‌కి ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

    లేటెస్ట్ గా బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వెళ్లిన డైరక్టర్‌ అనిల్‌ రావిపూడికి అక్కడ అభిజిత్‌ యాటిట్యూట్‌ నచ్చిందట. అందుకే అతన్ని ఎఫ్‌3లో ప్లేస్‌ చేశారని టాక్‌. ఇప్పుడే కాదు.. గతంలో ఎఫ్‌2 చేసేటప్పుడు కూడా నూతన్‌ నాయుడు క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశారు అనిల్‌ రావిపూడి. అయితే ఆ సినిమాలో నూతన్‌ ఉన్న విషయాన్ని పనిగట్టుకుని గుర్తుచేసుకుంటే తప్ప ఎవరికీ గుర్తురాడు. ఇప్పుడు ఎఫ్‌3లో అభిజిత్‌కి కూడా అలాంటి పాత్రే ఉంటుందా? లేకుంటే ప్రామినెంట్‌ రోల్‌ ఉంటుందా? అనేది ఇంపార్టెంట్‌ విషయం.

    ఇప్ప‌టికే సినీ వ‌ర్గాల్లో అభిజిత్ రెండు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డానికి ఓకే చెప్ప‌డ‌ని అంటున్నారు. అందులో ఎఫ్ 3 సినిమా చేరిందా? లేక వ‌చ్చిన అవ‌కాశాల్లో అది కూడా ఒక‌టా? అని తెలియ‌డం లేదు. ఒకవేళ ప్రామినెన్స్ లేని కేరక్టర్‌ అయితే అభిజిత్‌ ఆ ఆఫర్‌ని ఓకే చేసి కూడా వేస్టే అవుతుంది. కెరీర్‌లో ఇప్పటికే పెద్దగా నేమూ, ఫేమూ లేని ఈ యంగ్‌ హీరో మరోసారి తప్పులో అడుగు వేయకూడదనే కోరుకుంటున్నారు అభి ఆర్మీ.
    Published by:Anil
    First published:

    Tags: Anil Ravipudi, Bigg Boss 4 Telugu, F3 Movie

    తదుపరి వార్తలు