పునర్నవితో సినిమాకు ఓకే చెప్పిన రాహుల్..

Bigg Boss Telugu 3 : ‘బిగ్‌బాస్ తెలుగు 3’‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన రాహుల్, మరో ఇంటి సభ్యురాలు పునర్నవి తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజ్ తెచ్చుకున్నారు.

news18-telugu
Updated: November 11, 2019, 8:07 AM IST
పునర్నవితో సినిమాకు ఓకే చెప్పిన రాహుల్..
Instagram
news18-telugu
Updated: November 11, 2019, 8:07 AM IST
‘బిగ్‌బాస్ తెలుగు 3’‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన రాహుల్, మరో ఇంటి సభ్యురాలు పునర్నవి తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ హౌజ్‌లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చాలా మంది వ్యువర్స్ కేవలం ఈ జంట కెమిస్ట్రీని చూడటానికి ఇష్ట పడేవారు. మరో వైపు రాహుల్, పున్ను ప్రేమించుకుంటున్నారని.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని  సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేందుకు ఈ జంట పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచి.. బయట కొన్ని మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌‌తో మాట్లాడుతూ.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతేకాని లవర్స్ కాదంటూ రాహుల్ చాలా సార్లు స్పష్టం చేశాడు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహితులమని అంతే కాని మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చాడు. 
Loading...

View this post on Instagram
 

First time a picture with my #gang #pvvr 😍


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

అది అలా ఉంటే.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఓ ప్రశ్నకు సమాదానంగా.. పునర్నవితో సినిమా అవకాశం వస్తే హీరోగా నటిస్తావా.. అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు. పునర్నవితో సినిమా అవకాశం వస్తే..110 పర్సెంట్ సినిమా చేస్తానని తన ఇష్టాన్ని తెలిపాడు. దీంతో బంతి తెలుగ సినిమా నిర్మాతల కొర్టులో పడ్డట్లైంది. దీంతో మంచి లవ్ స్టోరితో ఓ సినిమాను ప్లాన్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ జంటకు యూత్‌లో విపరీతంగా క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్మాత ముందుకొచ్చిన మినిమం గ్యారెంటీగా హిట్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరీ ఎప్పుడూ ఈ సినిమా మెటీరియలైజ్ కానుందో..

మాల్దీవ్స్ బీచుల్లో అందాల శ్రీముఖి..
First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...