బిగ్‌బాస్: ఫైనల్లో కౌశల్‌కి పోటీ ఇచ్చేదెవరు? ఎవరి బలమెంత?

కౌశల్ ఆర్మీని తట్టుకుని మిగిలిన పార్టిసిపెంట్స్ పోటీ ఇవ్వగలరా... దీప్తి, తనీశ్, సామ్రాట్, గీతామాధురి, కౌశల్ వీరిలో టైటిల్ గెలిచే సత్తా ఎవరికి ఉంది?

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 24, 2018, 3:55 PM IST
బిగ్‌బాస్: ఫైనల్లో కౌశల్‌కి పోటీ ఇచ్చేదెవరు? ఎవరి బలమెంత?
‘బిగ్‌బాస్’ సీజన్ 2 ఫైనల్ పార్టిసిపెంట్లు
  • Share this:
‘బిగ్‌బాస్’ సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంటోంది. ఎన్.టీ.ఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1కి వీకెండ్స్‌‌లోనే మాత్రం ప్రేక్షాదరణ ఎక్కువగా లభిస్తే... సీజన్ 2 మాత్రం అందకు భిన్నంగా వీక్‌డేస్‌లోనూ మంచి వ్యూస్ సాధిస్తూ అదరగొడుతోంది. ఇందుకు ఒకే ఒక్క కారణం ‘కౌశల్ ఆర్మీ’. ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఓ సాధారణ పార్టిసిపెంట్‌గా వచ్చిన కౌశల్ మీద అభిమానంతో నిత్యం ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా వీక్షించే వారి సంఖ్యే ఎక్కువ. ముందుగా సీజన్ 2 మొత్తం 100 రోజులే అని ప్రకటించినప్పటికీ కౌశల్‌ వల్ల బిగ్‌బాస్ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ కారణంగా కార్యక్రమాన్ని మరో వారం రోజుల పాటు పెంచిన విషయం కూడా తెలిసిందే.

105 రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. చివరి ఎలిమినేషన్‌గా రోల్ రైడా హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అంతకు ముందు గుడ్ల టాస్క్‌లో గెలిచిన సామ్రాట్ నేరుగా ఫైనల్‌కి నామినేట్ అవ్వగా... మిగిలిన ఇంటి సభ్యులు కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీశ్‌లను ఫైనల్ పార్టిసిపెంట్లుగా ప్రకటించాడు నాని. ఈరోజు నుంచి ‘బిగ్‌బాస్’ సీజన్ 2 విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే సీజన్ 2లో కౌశల్‌కి వచ్చిన ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. కొన్ని ఎపిసోడ్లలో కౌశల్‌ను కార్నర్ చేసినందుకు హోస్ట్ నానిని ట్రోల్ చేశారు నెటిజనులు. అయితే ఐదుగురిలో ఎవరి బలమెంత? ‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ కొట్టే సామర్థ్యం ఎవరికుంది?

కౌశల్...

‘బిగ్‌బాస్’ కార్యక్రమం ప్రారంభానికి ముందుగానీ, ప్రారంభం అయిన తర్వాత రెండు, మూడు వారాల పాటు గానీ కౌశల్‌కి పెద్దగా పాపులారిటీ లేదు. ఇప్పుడు మనోడు పెద్ద సెలబ్రిటీ. తనదైన గేమ్‌తో ముక్కుసూటితనం, ఎటువంటి భేషిజాలు లేకుండా మాట్లాడడం, బంధాలు పెట్టుకోకుండా ఆడడం వంటి లక్షణాలతో స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు కౌశల్. ఆన్‌లైన్ సర్వేల్లో కూడా కౌశలే బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అని తేల్చేశారు. ఆన్‌లైన్ సర్వే పోల్స్‌లో కౌశల్‌కి వచ్చే ఓట్లతో పోలిస్తే... మిగిలిన సభ్యులకు 10 శాతం ఓట్లు కూడా రాకపోవడం విశేషం.దీప్తి నల్లమోతు...
టీవీ9 న్యూస్ రీడర్‌‌గా ఫేమస్ అయిన దీప్తి నల్లమోతు... ‘బిగ్‌బాస్’ కార్యక్రమంలో ఫైనల్ చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కౌశల్‌తో సమానంగా ఎలిమినేషన్ నామినేషన్స్‌ ఫేస్ చేస్తూ వచ్చిన దీప్తి... అన్యూహ్యంగా వాటినుంచి తప్పించుకుని ఫైనల్ దాకా చేరింది. అయితే దీప్తిని కాపాడేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ పనిచేస్తోందని ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకూ నిజం అనేది తెలీదు కానీ తనదైన కలగొలుపుతనం, మాటకారితనంతో మంచి ఓట్లే సొంతం చేసుకుంటోంది దీప్తి నల్లమోతు. అయితే టైటిల్ గెలిచేంత టాలెంట్ అయితే దీప్తి దగ్గర లేదన్నది చాలామంది చెప్పుకునే మాట. టాప్ 3లో కూడా దీప్తి ఉండడం అనుమానమే.

గీతామాధురి...సింగర్‌గా ప్రేక్షకాదరణ పొందిన గీతామాధురి... బిగ్‌బాస్ టైటిల్ విన్నర్స్ అవుతారని అంచనా వేసిన వారిలో ఒకరు. ప్రారంభం నుంచే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న గీతామాధురి... భానుశ్రీ, కౌశల్ వివాదం జరిగినప్పుడు కౌశల్ వైపు నిలబడి మంచి మార్కులు కొట్టేసింది. టీనేజ్ అమ్మాయిలకూ, టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామందికి ఈమె ఫేవరెట్ పార్టిసిపెంట్. అయితే ఆమె చేష్టలు ఒకనొక దశలో చాలా మెచ్యురిటీగా కనిపిస్తే... మరికొన్ని సందర్భాల్లో ఛైల్డిష్‌గా అనిపిస్తాయి. అదీగాక కౌశల్‌ని సీజన్ మొత్తానికి నామినేట్ చేసింది గీతా మాధురియే. దాంతో గీతపైన ఓ రకమైన నెగిటివిటీ వచ్చింది. సీజన్ 1లో హరితేజలా టాప్ 3లో గీతామాధురి కచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పగలం.

తనీశ్...
ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా... హీరోగా నటించి... డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ప్రత్యేక్షం అయ్యాడు తనీశ్ అల్లాడి. అయితే మొదటి నుంచి మనోడికి హౌస్‌లో పెద్ద పాజిటివిటీ అయితే లేదు. దీప్తి సునయనతో ఆ తర్వాత నందిని రాయ్‌తో ప్రేమాయణం నడిపిన తనీశ్... వాళ్లు వెళ్లిన తర్వాత కౌశల్ మీద కోపంతో ఆవేశంతో ఊగిపోవడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. నిజానికి కౌశల్ ఆర్మీ మిగిలిన వారిని టార్గెట్ చేయడం వల్ల తనీశ్... ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఫైనల్‌లో ఉన్నవారిలో తనీశ్‌కి హీరోగా కాస్తో కూస్తో ఫాలోయింగ్ ఉంది. అది వర్కవుట్ అయితే కనుక టాప్ 3లో ఉంటాడు.

సామ్రాట్...
సామ్రాట్ అనగానే ముందుగా గుర్తొచ్చే విషయం తేజస్వితో రొమాన్స్. తేజస్వి హౌస్‌లో ఉన్నంత కాలం సామ్రాట్ చేసింది అదొక్కటే. తేజస్వి ఎలిమినేషన్ తర్వాత చిన్న పిల్లాడిగా బిహేవ్ చేస్తూ కొందరిని ఎంటర్‌‌టైన్ చేస్తున్నాడు. అయితే కౌశల్ ఆటతీరు నచ్చేవారికి, సామ్రాట్ ఏ మాత్రం నచ్చడు. నిజానికి గుడ్ల టాస్క్ కారణంగా లక్కీగా ఫైనల్ చేరాడు సామ్రాట్. లేకపోతే రోల్ రైడా బదులు మనోడే ఎలిమినేట్ అయ్యేవాడు. సామ్రాట్ కూడా టాప్ 3లో ఉండడం కష్టమే.

మొత్తంగా చూస్తే వార్ వన్‌సైడే... ఎటువంటి రాజకీయాలు, హైడ్రామా జరగకపోతే టైటిల్ కౌశల్ ఆర్మీదే... అదే కౌశల్ మండాదే!
First published: September 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు