Bigg Boss Telugu 4 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇంటి నుంచి పోయేది వీరే..

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం ఎనిమిదవ వారం నడుస్తుండగా.. ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

news18-telugu
Updated: October 30, 2020, 7:55 AM IST
Bigg Boss Telugu 4 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇంటి నుంచి పోయేది వీరే..
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం ఎనిమిదవ వారం నడుస్తుండగా.. ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వస్తోన్న సమాచారం మేరకు ఈ వారం హౌజ్ నుండి ఒకరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో 11 మంది హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయినా వారిలో అమ్మా రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా ఉన్నారు. వీరిలో ఇద్దురు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. నామినేషన్ అయిన వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా అఖిల్, లాస్య, అరియానా ఉండడంతో.. ఈ ముగ్గురు ఈ వారం సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక డేంజర్ జోన్ లో మోనాల్, అమ్మా రాజశేఖర్‌లు ఉన్నారు. అయితే ఈ వారం కూడా మోనాల్ సేవ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పావురం. దీంతో  ఎప్పటిలాగే మోనాల్ ఈ వారం కూడా సేవ్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే సోషల్ మీడియా స్టార్ మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం చాలా ఉందని టాక్. మూడు వారాలుగా మెహబూబ్ నామినేషన్స్ లో లేడు.

దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఎప్పుడెప్పుడు మెహబూబ్ నామినేషన్స్‌లోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు బీబీ ప్రేక్షకులు. మూడవ వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన టైం లోనే మెహబూబ్ ఎలిమినేట్ కావాల్సిందని.. కావాలనే బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ కాకుండా చేశాడని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. దీంతో ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అమ్మా రాజశేఖర్, మెహబూబ్ లు ఇద్దరూ ఇంటినుంచి వెళ్లాల్సిందేనని అంటున్నారు. ఇక ఎప్పటి లాగే ఒక ఎలిమినేషన్ ఉంటే మాత్రం అమ్మా రాజశేఖర్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నాడని అంటున్నారు.
Published by: Suresh Rachamalla
First published: October 29, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading