బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. వివిధ భాషల్లో సూపర్ క్రేజ్ అందుకున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో జరిగే పనులు, కంటిస్టెంట్స్ ఓవర్ డోస్ పర్‌ఫార్‌మెన్స్‌పై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ తగ్గలేదు సరికదా 24 గంటల ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ OTT వేదికపైకి కూడా వచ్చేశాడు బిగ్ బాస్. గత సీజన్‌తో బిగ్ బాస్ OTT షురూ అయింది. ఇప్పుడు అదే బాటలో సీజన్ 6 (Bigg Boss Season 6) కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఇక ఈ సీజన్ పై హైప్ తీసుకురావడంలో భాగంగా వదులుతున్న కొన్ని అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా బిగ్ బాస్ లోగో రిలీజ్ చేసిన యాజమాన్యం.. తాజాగా ఈ సీజన్ 6 ప్రోమో (Bigg Boss Telugu Season 6 Promo) వదిలారు. 55 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ వీడియోతో బిగ్ బాస్ సీజన్ 6పై జనం ఎంత ఆతృతగా ఉన్నారో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో చూశాక జనం రియాక్షన్స్ చూస్తుంటే ఈ ప్రయత్నం కాస్త బెడిసికొట్టిందనే చెప్పుకోవచ్చు.
తమ కూతురుకు పెళ్లి చేసి అప్పగింతలు చేస్తున్న తల్లిదండ్రుల ఫీలింగ్స్ ముందుగా చూపించి ఆ తర్వాత సీన్ లో తమ కూతురు అప్పగింతల కంటే ఆ తల్లిదండ్రులకు బిగ్ బాస్ షో ముఖ్యం అన్నట్లుగా వీడియో కట్ చేశారు మేకర్స్. కూతురు చేతులు పట్టుకొని ఎంతగానో బాధపడుతున్న ఆ తల్లిదండ్రులకు బిగ్ బాస్ వస్తున్నట్లు మొబైల్ అలర్ట్ రాగానే.. కూతురిని అక్కడే వదిలేసి వెళ్లి టీవీ ముందు కూర్చోవడం చూపించారు.
ఇక ఆ అప్పగింతల్లో నాగార్జున ఎంటరై.. అప్పగింతలు అయ్యేదాకా కూడా ఆగలేక పోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అని చెప్పడం కాస్త చేదుగానే అనిపించింది. ఇకపోతే లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అని నాగ్ చెప్పడం మరీ ఓవర్ యాక్షన్ అంటున్నారు జనం. దీనమ్మ జీవితం.. కన్న వారికి కన్న కూతురు కంటే బిగ్ బాస్ ఎక్కువా????... ఏమన్నా లాజిక్.. అంటూ ఏకిపారేస్తున్నారు పబ్లిక్. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోపై జనం పెద్దగా పాజిటివ్ గా రియాక్ట్ కాకపోతుండటం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Bigg boss telugu, Nagarjuna