• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS TELUGU SEASON 5 WILL START AFTER CORONA VIRUS PANDEMIC ONLY NR

Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేది ఆ నెలలోనే.. రెడీ అయిపోండి!

Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేది ఆ నెలలోనే.. రెడీ అయిపోండి!

Bigg Boss Telugu

Bigg Boss Telugu: బుల్లితెరలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల కంటే రియాలిటీ ప్రోగ్రామ్ లే బాగా ఆసక్తిగా ఉంటాయి. అందులో బిగ్ బాస్ అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  • Share this:
    Bigg Boss Telugu: బుల్లితెరలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల కంటే రియాలిటీ ప్రోగ్రామ్ లే బాగా ఆసక్తిగా ఉంటాయి. అందులో బిగ్ బాస్ అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ఎంతోమందిని తన అభిమానులను చేసుకుంది. అంతేకాకుండా సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో టీవీల ముందు వాలిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా అవతలి వారు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి.. అది కూడా సెలబ్రిటీల విషయంలో ఎలా ఉంటారో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

    ఇక ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా.. ప్రస్తుతం ఐదవ సీజన్ పూర్తి కానుంది. ఇక గత ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో సీజన్ 4 ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఇక దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి 5 సీజన్ ప్రారంభించాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో అందులో పాల్గొనే కంటెస్టెంట్ లను కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈసారి ఇండస్ట్రీ సెలబ్రిటీలను కాకుండా.. సోషల్ మీడియా నుండి గుర్తింపు పొందిన సెలబ్రెటీలను తీసుకొనున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫైవ్ సీజన్ గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మరో అప్ డేట్ వచ్చింది.

    ఈ సీజన్ ను జూన్ లో నిర్వహించాలని అనుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో సీజన్ 5 ను నిర్వహించడం సరైనది కాదని భావించారు. ఇక తాజాగా ఈ షోను ఆగస్టులో నిర్వహించాలని స్టార్ మా యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది ఇదే పరిస్థితి ఉండగా పలు జాగ్రత్తలతో ప్రోగ్రామును నడిపించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మరీ ఘోరంగా ఉండటంతో అది సాధ్యమయ్యేలా లేదు కాబట్టి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు పరిస్థితులు కుదుటపడితేనే సీజన్ 5 ప్రారంభం కానుందని తెలుస్తుంది.
    Published by:Navya Reddy
    First published: