Home /News /movies /

BIGG BOSS TELUGU SEASON 5 DO YOU KNOW HOW MUCH ANEE MASTER GOT FOR 11 WEEKS KNOW THE DETAIS HERE VB

Bigg Boss Telugu 5: యానీ మాస్టార్ 11 వారాలకు రెమ్యూనరేషన్ ఎంత..? తెలిస్తే షాక్ అవుతారు..

యానీ మాస్టార్

యానీ మాస్టార్

Bigg Boss Telugu 5: తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12వ వారం ఎలిమినేషన్లో ఒక్క మానస్ తప్ప మిగిలిన ఏడుగురు ఉన్నారు.

ఇంకా చదవండి ...
    తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ (Bigg Boss Season 5) 5. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12వ వారం ఎలిమినేషన్లో ఒక్క మానస్ తప్ప మిగిలిన ఏడుగురు ఉన్నారు. ఈ వారం నామినేషన్లో(Nomination) ఉన్నది యాంకర్ రవి, కాజల్, సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, ప్రియాంక మరియు షణ్ముఖ్. అయితే కొన్ని ప్రైవేట్ సర్వేలు నిర్వహించిన వాటిలో ఎక్కువగా వీరిలో కాజల్, ప్రియాంక, సిరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తేలింది. వీరిలో ఎక్కువగా ప్రియాంక బయటకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. అయితే గత వారం ఇంటి నుంచి యానీ మాస్టార్ బయటకు వచ్చని విషయం తెలిసిందే. ఈమె దాదాపు టాప్ 5 లో ఉంటారనే ఊహగానాలు కూడా వచ్చాయి.

    Bigg Boss Telugu 5: అవును.. ‘బిగ్‌బాస్‌ హౌస్’ లవర్స్ అడ్డాగా మారింది..! ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ..


    కానీ ఆమె గ‌త వారం త‌న ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇక 11 వారాల‌కు గాను అనీ మాస్ట‌ర్‌కు ల‌భించిన మొత్తం ఎంతో తెలుసుకునేందుకు నెటిజ‌న్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. యానీ మాస్టార్ అప్పటికే సెలెబ్రిటీ. ఆమెను బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకునే ముందే వారానికి రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం 11 వారాల‌కు రూ.33 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆమె అందుకున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ చెప్పుకునే మరో విషయం ఏటంటే.. యానీ మాస్టార్ కంటే ముందు జెస్సీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఇలా అకస్మాత్తుగా వెళ్లి.. ఇంట్లో ఉన్న మానస్ లేదా కాజల్ లో ఒకరిని సేవ్ చేసి వెళ్లాడు.

    Bigg Boss Telugu 5: షణ్ముఖ్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం అదేనా.. అదే సన్నీకి కలిసొస్తుందా.. !


    ఆ ఇద్దరి ఎక్కువగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మానస్ అనే చెప్పాలి. మానస్ సేవ్ అయి.. కచ్చితంగా కాజల్ బయటకు వెళ్లాలి. కానీ.. ఆమెకు ఓ వారం ఇలా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు అనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అవ‌డం కాజ‌ల్‌కు క‌ల‌సి వ‌చ్చింది. కానీ కాజ‌ల్ ఇంకో వారం మాత్ర‌మే ఉంటుంద‌ని తెలుస్తోంది. కొన్ని సర్వేల ప్రకారం ప్రియాంక బయటకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక 12 వ వారం నామినేషన్ ఈ సారి ఉత్కంఠగా సాగింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. హౌస్ ను మొత్తం వేడి పుట్టించారు.

    Bigg Boss 5 Telugu: భారీగా పడిపోయిన షణ్ముఖ్ గ్రాఫ్.. నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన మరో కంటెస్టెంట్..


    శ్రీరామ చంద్ర అయితే ఓ రేంజిలో విరుచుకుపడ్డాడు. సన్నీ ఆడే ఆట తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. అదే విధంగా సన్నీ కూడా దానికి తగ్గట్లు సమాధానం ఇచ్చాడు. ఇక ఈ సారి టాప్ 4 కంటెస్టెంట్లు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర మరియు యాంకర్ రవి ఉంటారని తెలుస్తోంది. అయితే టాప్ 5 లో మరో వ్యక్తి ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు. మానస్ లేదా సిరి వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Bigg boss 5 telugu buzz

    తదుపరి వార్తలు