Bigg Boss 4 | బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో.. నాగార్జున ట్రిపుల్ ధమాకా..

తెలుగు స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది.

news18-telugu
Updated: August 16, 2020, 4:56 AM IST
Bigg Boss 4 | బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో.. నాగార్జున ట్రిపుల్ ధమాకా..
Bigg Boss 4 | నాగార్జున (Image; @starmaa)
  • Share this:
తెలుగు స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. దీంట్లో కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ గా రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్, గ్లింప్స్ రిలీజ్ చేసిన సంస్థ.. ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున ట్రిపుల్ యాక్షన్‌లో కనిపిస్తున్నాడు. ఇరుగుపొరుగు వారిళ్లలో జరిగే గిల్లి కజ్జాలను చూసి ఎంటర్ టైన్ మెంట్ పొందుతున్న తాత, మనవడికి మధ్యలో నాగార్జున వచ్చి ఓ సర్ ప్రైజ్ చేస్తాడు. ఇంటి సభ్యులకు అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ అంటూ బిగ్ బాస్ 4 గురించి అనౌన్స్ చేస్తాడు.



ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గతానికి భిన్నంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే, కంటెస్టెంట్ల షో ప్రారంభానికి వారం రోజుల ముందే క్వారంటైన్‌కు వెళ్లిపోనున్నారు. అలాగే, పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని లోనికి అనుమతించనున్నారు. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 కేవలం 10 వారాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading