Bigg Boss 3 : బిగ్ బాస్ 3 ఇప్పట్లో లేనట్లేనా...? జులై చివరి వరకూ ఆగాల్సిందేనా..?

Bigg Boss Telugu season 3 : బిగ్ బాస్ షో ఫ్యాన్స్‌కి ఇది నిజంగా నిరాశ కలిగించే విషయమే. బిగ్ బాస్ 3 లాంచింగ్ జులైకి పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 1:05 PM IST
Bigg Boss 3 : బిగ్ బాస్ 3 ఇప్పట్లో లేనట్లేనా...? జులై చివరి వరకూ ఆగాల్సిందేనా..?
అనుష్క, బిగ్ బాస్ త్రీ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 1:05 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్లు 1, 2 దుమ్మురేపాయి. ఇక మూడో సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... ఈ షో లాంచింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ వరల్డ్ కప్పే. మే 30 నుంచీ జులై 14 వరకూ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ టైంలో ఏ ఫ్యాన్సైనా... అన్ని షోలూ వదిలేసి... క్రికెట్టే చూస్తారు. అందులోనూ ఈ సంవత్సరం ఇండియా కప్ కొడుతుందనే అంచనాలు రెట్టింపయ్యాయి. టీం ఇండియాలో ఆల్‌రౌండర్లకు తోడు అద్భుతమైన బౌలర్లున్నారు. అందువల్లే కప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువంటున్నారు వెటరన్లు. ఇలాంటి టైంలో బిగ్ బాస్ 3 ఎడిషన్ వచ్చినా... చూసే అవకాశాలు తక్కువే. అందువల్ల బిగ్ బాస్ రియాల్టీ షోను... జులైకి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

జులై 21న ఆదివారం నాడు అంటే... వరల్డ్ కప్ ముగిసిన వారం తర్వాత బిగ్ బాస్ 3 మొదలవుతుందని తెలిసింది. ఐతే ఇందుకు సంబంధించి "స్టార్ మా" మేనేజ్‌మెంట్ నుంచీ అధికారికంగా ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈసారి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున లేదా... విక్టరీ వెంకటేష్ ఉంటారని ప్రచారం జరుగుతోంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి రియాల్టీ షోలలో హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం నాగార్జునకు బిగ్ బాస్ 3లో పనికొస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఐతే నాగార్జున ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. వెంకటేష్‌కి రియాల్టీ షోతో బుల్లితెరకు పరిచయం అవ్వడం ఇష్టం లేదని తెలుస్తోంది.

తాజాగా టాలీవుడ్ నటి అనుష్క పేరు కూడా తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ త్రీ ఎపిసోడ్ ఆలస్యమవుతున్న కొద్దీ హోస్ట్ లిస్ట్ పెరుగుతూ ఉంది. చిరంజీవి, విజయ్ దేవరకొండ, రష్మీ గౌతమ్, ఉదయ్ భాను పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బిగ్ బాస్ 1కి జూనియర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. బిగ్ బాస్ 3లో వీరిద్దరికి ధీటైన స్థాయి హీరోని హోస్ట్‌గా పెట్టుకుంటే షోకి పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ 2 ముగిసి ఇప్పటికే 10 నెలలు గడిచిపోయింది. హోస్ట్ కన్ఫర్మ్ చేసి... జులై చివర్లో బిగ్ బాస్ 3ని ప్రారంభించాలని స్టార్ మా భావిస్తోంది. అటు బిగ్ బాస్ 3లో కంటెస్టంట్స్‌ను ఫైనల్ చేయడంపై నిర్వాహకులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

 ఇవి కూడా చదవండి :

ఏపీలో ఉగ్రవాదులు... హోటళ్లే టార్గెట్... అలర్టైన ప్రభుత్వం...

వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు... తెలంగాణలో విషాదం...
Loading...
చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ

బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...