Bigg Boss 3 | ఈ వారం బిగ్ బాస్‌లో ఎలిమినేట్ అయ్యేది రోహిణి?

Bigg Boss Telugu 3 | నాలుగో వారం ఎలిమినేట్ కాబోయేది రోహిణి అని సమాచారం.

news18-telugu
Updated: August 17, 2019, 10:26 PM IST
Bigg Boss 3 | ఈ వారం బిగ్ బాస్‌లో ఎలిమినేట్ అయ్యేది రోహిణి?
రోహిణి, బిగ్ బాస్ కంటెస్టెంట్
news18-telugu
Updated: August 17, 2019, 10:26 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 జోరుగా సాగుతోంది. నాలుగోవారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. మొదటి వారం హేమ, రెండో వారం జాఫర్, మూడో వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం ఉత్కంఠగా మారింది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారం బ్యాగ్ సర్దుకోబోయేది రోహిణి అని సమాచారం. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ వారం రోహిణి ఎలిమినేట్ కావడం ఖాయమని తెలిసింది. అయితే, అధికారికంగా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడడమే. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అందరి ముసుగు తీసేశాడు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారికి రకరకాల అవార్డులు ఇచ్చాడు. హౌస్‌లో వారి తీరును బట్టి వారికి అవార్డులు ఇచ్చాడు. నాలుగో వారం ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. అందులో శివజ్యోతి, వరుణ్ సేవ్ అయ్యారు. మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌కు ఉన్నారు. అందులో రోహిణి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...