Bigg Boss Telugu 3 | అలీ రెజా ఎలిమినేషన్.. బిగ్‌బాస్‌ను బూతులు తిడుతున్న నెటిజన్లు..

Bigg Boss Telugu 3 | బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ కావడంతో ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. రేపటి నుంచి బిగ్ బాస్ షో చూడడమే మానేస్తామంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 8, 2019, 11:02 PM IST
Bigg Boss Telugu 3 | అలీ రెజా ఎలిమినేషన్.. బిగ్‌బాస్‌ను బూతులు తిడుతున్న నెటిజన్లు..
అలీ రెజా (File)
  • Share this:
బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‌లో ఈ వారం అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా బయటకు వస్తుంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ తీవ్రంగా ఏడ్చేశారు. అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ కావడం అనేది అందర్నీ షాక్‌కి గురి చేసింది. లోపల ఉన్న కంటెస్టెంట్స్‌కే కాదు. బయట ఉన్న బిగ్ బాస్ ప్రేక్షకులు, అలీ రెజా అభిమానులను మరింత షాక్‌లోకి నెట్టేసింది. దీంతో నెటిజన్లు బిగ్ బాస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇలా బాగా ఆడే వారిని అందర్నీ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే.. తర్వాత ఎవరు చూస్తారంటూ ఒకరు ట్వీట్ చేస్తే.. రేపటి నుంచి బిగ్ బాస్ చూడడం మానేస్తున్నామని మరికొందరు ట్వీట్ చేశారు.











అయితే, మరికొందరు మాత్రం అలీ రెజా రీ ఎంట్రీ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.



First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు