Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్లో నాగార్జున (Nagarjuna) మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ సీజన్ ఓటీటీ మొదలు కానుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన తెలుగు ఓటీటీ లోగోను విడుదల చేశారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ తన చివరి కోరికగా బిగ్‌బాస్ చూడాలంటూ ఖైదీగా వెన్నెల కిషోర్ ఫన్నీగా చెప్పడం బాగుంది. ఈ ప్రోమోలో నాగార్జున వకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టారు. మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ నాన్‌స్టాప్ బిగ్‌బాస్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్నట్టు ప్రకటించారు.
ఈ ప్రోమోలో పిక్ పాకెటింగ్ కేసులో వెన్నెల కిషోర్‌కు ఉరిశిక్ష పడుతోంది. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ తన చివరి కోరికగా బిగ్‌బాస్ చూడాలనుకుంటారు. ఈ సందర్భంగా నాన్ స్టాప్‌గా ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో కు ఎండ్ ఉండదు. అతనికి ఉరిశిక్ష పడదనే ఫన్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా బిగ్‌బాస్ ప్రసారం చేస్తున్నట్టు చెప్పారు.
Extremely delighted to present NonStop fun with @vennelakishore @murlisharma72
? https://t.co/VuXtRy3MhI ?
మొదలౌతుంది #BiggBossNonStop Entertainment!!
Mee @DisneyPlusHS లో
from 26th Feb
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 15, 2022
అత్యంత ఆసక్తి కలిగించే హౌస్మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుందని చెబుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు.
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు OTTలో పాల్గొనడానికి జబర్దస్త్ యాంకర్ వర్షిణిని సంప్రదించినట్లు సమాచారం అందుతోంది. అందులో భాగంగా ఆమె ఈ షోలో పాల్గోనేందుకు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. యాంకర్ వర్షిణితో పాటు మరో యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఫైనల్ అయ్యారని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు ఈటీవీలో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్ ఢీ 10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గోననున్నారని అంటున్నారు. వీరితో పాటు మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా ఫైనల్ అయ్యినట్లు సమాచారం అందుతోంది. వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీస్‌లో నటించారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్స్ సిరీస్‌లో నటించారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss ott telugu, Hot star, Nagarjuna Akkineni, Tollywood