Home /News /movies /

BIGG BOSS TELUGU OTT BEGINS HERE IS CONTESTANTS LIST SR

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభం.. ఎక్కువుగా పాత వారే... లిస్ట్ ఇదే..

Bigg Boss Telugu OTT Photo : Twitter

Bigg Boss Telugu OTT Photo : Twitter

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యింది. దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా ఉండబోతున్నారు.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu OTT : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యింది (Bigg Boss Telugu OTT). దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా ఉండబోతున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో ముఖ్యంగా చాలా మంది పాత కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి కంటెస్టెంట్‌గా ఇంట్లోకి అశు రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ విట్టా, మూడో కంటెస్టెంట్‌గా ముమైత్ ఖాన్ వచ్చారు. ఇక నాల్గవ కంటెస్టెంట్‌గా అజయ్ అనే కొత్త కంటెస్టెంట్ వచ్చారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చోకరపు ఎంట్రీ ఇచ్చారు.

    ఆరో కంటెస్టెంట్‌గా ఆర్ జే చైతూ వచ్చారు. ఏడో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా ఎంట్రీ ఇచ్చారు.ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ వచ్చారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్ అనే మోడల్ ఎంట్రీ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ, పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వీ మదివాడ, పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ రాయ్, పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ శివ, పదిహేనో కంటెస్టెంట్‌గా బిందు మాధవి, పదహారో కంటెస్టెంట్‌గా హమీదా ఎంట్రీ ఇచ్చారు. పదిహేడో కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్ వచ్చారు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఈ పదిహేడు మందిలో ఎక్కువుగా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్సే ఉన్నారు. చూడాలి మరి ఈసారి ఎలా ఉండనుందో..

































    ఇక ఈ లేటెస్ట్ షో హాట్ స్టార్‌లో.. 24/7 లైవ్ స్ట్రీమింగ్ నడుస్తూనే ఉంటుంది. 84 రోజుల పాటు ఈ ఓటిటి సీజన్ ఉండబోతుంది. దాదాపు మూడు నెలలు పాటు సాగనున్న ఈ సరికొత్త రియాలిటీ షో ఎన్ని కాంట్రవర్సీలకు సెంటర్ అవుతుందో.. అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg boss ott telugu, Tollywood news

    తదుపరి వార్తలు