Home /News /movies /

BIGG BOSS TELUGU GRAND FINALE SOHEL ELIMINATED AFTER TAKING 25 LAKHS GIFT SK

Bigg Boss Telugu Grand Finale: రూ.25 లక్షలు తీసుకొని సోహెల్ ఎలిమినేటెడ్?

సోహెల్

సోహెల్

సోహెల్‌కు నాగార్జున రూ.25 లక్షల డీల్ ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. దానికి సోహెల్‌ ఒప్పుకొని పోటీ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

    Bigg Boss Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ రియాలిటీ షోకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే వేడుకలు మొదలయ్యాయి. టాలీవుడ్ నుంచి పలువురు తారలు వచ్చి బిగ్ బాస్ స్టేజిపై సందడి చేశారు. ఐతే బిగ్‌బాస్ సెట్ నుంచి తాజాగా ఓ లీక్ బయటకు వచ్చింది. హౌస్‌లో అగ్రెస్సివ్ స్టార్‌గా పేరు తచ్చుకున్న సోహెల్.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అభిజీత్, అఖిల్, సోహెల్ స్టేజిపై ఉండగా.. సోహెల్‌కు నాగార్జున రూ.25 లక్షల డీల్ ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. దానికి సోహెల్‌ ఒప్పుకొని పోటీ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.



    నిన్న రీయూనియన్‌లో భాగంగా మెహబూబ్... సోహెల్ వద్దకు వెళ్లి ఏదో సైగలు చేసిన విషయం తెలిసిందే. చేతి వేళ్లతో హింట్ ఇచ్చినట్లు కనిపించింది. మెహబూబ్ సైగలు సోహెల్ కూడా అర్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత తలకు చేతులు పెట్టుకొని వెనక్కి వెళ్లిపోయాడు సోహెల్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    ఐతే సోహెల్‌కు మెహబూబ్ ఇచ్చిన హింట్ ఏంటన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోహెల్ బిగ్ బాస్ విన్నర్ కావడం లేదని.. రెండో లేదా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుదని మెహబూబ్ హింట్ ఇచ్చినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. విన్నర్ ప్రకటనకు ముందు నాగార్జున ఒకవేళ డీల్ ఆఫర్ చేస్తే.. దానికి ఒప్పుకొని, డబ్బులు తీసుకొని బయట పడాలని సూచించినట్లు చెబుతున్నారు. డబ్బులు తీసుకోవాలని తన చేతి వేళ్లతో మెహబూబ్ క్లియర్‌గా సైగలు చేశాడని ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో అతడి ఫ్రెండ్ సలహా మేరకే సోహెల్ రూ.25 లక్షలు తీసుకొని పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే మరికాసేపు ఆగక తప్పదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు