Home /News /movies /

BIGG BOSS TELUGU GRANAD FINALE NAGARJUNA SAID OK TO LISTEN KUMAR SAI MOVIE STORY SK

Bigg Boss Telugu Grand Finale: గుడ్‌న్యూస్ చెప్పిన నాగార్జున.. కుమార్ సాయి ఫుల్ ఖుషీ

కుమార్ సాయి, నాగార్జున

కుమార్ సాయి, నాగార్జున

Bigg Boss Telugu Grand Finale: ఐదుగురు సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫినాలేకు ఏకంగా 15 కోట్ల 60 లక్షల ఓట్లు పోలయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పారు. ఐతే అనధికారిక పోలింగ్‌తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu Granad Finale: బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షో ఆఖరి అంకానికి చేరింది. గ్రాండ్ ఫినాలే అంగ రంగ వైభవంగా జరుగుతోంది. ఫైనల్ కార్యక్ర్రమానికి బిగ్ బాస్ హౌస్‌మేట్స్ అంతా హాజరయ్యారు. మోనాల్, లాస్య, కల్యాణి, కుమార్ సాయి, స్వాతి, గంగవ్వ, సుజాత, అవినాష్, నోయెల్, దివి, మెహబూబ్, సూర్య కిరణ్, అమ్మరాజశేఖర్ విచ్చేసి బిగ్ బాస్ సెట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ అందరితో హోస్ట్ నాగార్జున మాట్లాడారు. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కమెడియన్ కుమార్ సాయిని కూడా పోస్ట్ బిగ్‌బాస్ లైఫ్ గురించి అడిగారు నాగార్జున.

    బిగ్ బాస్ తర్వాత లైఫ్ అద్భుతంగా ఉందని కుమార్ సాయి చెప్పాడు. ఐతే ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయిందని చెప్పాడు. వెంటనే అందుకున్న హోస్ట్ నాగార్జున.. 'స్టోరీయే' కదా అని అన్నారు. 'అవును సార్'.. అని కుమార్ సాయి చెప్పడంతో.. 'ఖచ్చితంగా నువ్వు చెప్పే సినిమా స్టోరీ వింటాను'.. నాగార్జున చెప్పారు. ఆ మాట విన్న వెంటనే కుమార్ సాయి ఎంతో ఖుషీ అయ్యాడు. డైరెక్టర్ కావాలన్న తన కోరిక నెరవేరుతోందని ఉబ్బితబ్బి పోయాడు. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమయంలోనే కుమార్ సాయి తన కోరిక బయటపెట్టాడు. ఖచ్చితంగా నువ్వు చెప్పే కథ వింటానని అప్పుడూ హామీ ఇచ్చారు.. ఇప్పుడూ హామీ ఇచ్చారు నాగార్జున.

    మరోవైపు ఐదుగురు సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫినాలేకు ఏకంగా 15 కోట్ల 60 లక్షల ఓట్లు పోలయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పారు. ఐతే అనధికారిక పోలింగ్‌తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు సమాచారం. ఎవరికీ రానన్ని ఓట్లను ఈ మిస్టర్ కూల్ సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో అఖిల్, సోహెల్, అరియానా, హారిక ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే అభిజీత్ గెలిచాడో? లేదో? మరికాసేపట్లో తేలనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bigg Boss, Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు