Punarnavi:బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి ఎంగేజ్మెంట్ అయిపోయిందోచ్.. వరుడు ఎవరంటే..

 Bigg Boss Fame Punarnavi Bhupalam | బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటే తాజాగా పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చూస్తే త్వరలో పునర్నవి పెళ్లి చేసుకోబోతున్న విషయానికి బలం చూకూర్చింది. 

news18-telugu
Updated: October 28, 2020, 8:29 PM IST
Punarnavi:బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి ఎంగేజ్మెంట్ అయిపోయిందోచ్.. వరుడు ఎవరంటే..
పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ (Instagram/Photo)
  • Share this:
Bigg Boss Fame Punarnavi Bhupalam | బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటే తాజాగా పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చూస్తే త్వరలో పునర్నవి పెళ్లి చేసుకోబోతున్న విషయానికి బలం చూకూర్చింది.  పునర్నవి భూపాలం విషయానికొస్తే..  అప్పటి వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘ఉయ్యాల జంపాల’ వంటి  ఎన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసింది.  బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. మొన్నీమధ్యే ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. అయినా కూడా అవకాశాల కోసం అమ్మడికి హాట్ షో తప్ప మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు. దీంతో ఈ  అమ్మడికి సరైన అకకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ ఒకింటావిడా కావాలని ఫిక్స్ అయింది. త్వరలో తాను ఓ ఇంటామె కాబోతున్నానంటూ ఓ పోస్ట్ చేసింది.








View this post on Instagram





Finally! It's happening 🥰❤️


A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on





ఆ పోస్ట్‌లో  చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అవతలి అతను తొడిగిన ఫోటోను పోస్ట్ చేసింది. అయితే.. పునర్నవికి కాబోయే వాడు ఎవడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలో పెళ్లి తేదిని పునర్నవి ప్రకటించే అవకాశం ఉంది. కెరీర్ మొదట్లో ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్ పాత్రలో.. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు. ఏదేమైనా కూడా తెలుగమ్మాయి అయినా కూడా పున్నుకు కలిసిరావడం లేదు. మధ్యలో ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. కానీ అది కరోనా కారణంగా ముందుకు సాగలేదు. పైగా అందాలన్నీ ఆరబోస్తానని ఆఫర్లు ఇస్తున్నా కూడా దర్శక నిర్మాతలు మాత్రం ఈమెను పట్టించుకోవడం లేదు. ఇక తనకు సినిమాల కంటే కూడా చదువు ముఖ్యం అంటుంది పున్ను బేబీ.

ప్రతీ ఒక్కరికి పర్సనల్ ఉంటుందని.. తనకు కూడా ఉందని.. పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని చెప్పిన పునర్నవి.. ఇపుడు మూడు ముళ్ల బంధంతో ఒకింటావిడా కాబోవడం విచిత్రం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 28, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading