ఆ కారణంగా బిగ్ బాస్ భామ ఆత్మహత్యచేసుకోవాలనీ అనుకుందట..

Nandini Rai : నందిని రాయ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ బిగ్ బాస్ బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టోచ్చు.

news18-telugu
Updated: June 23, 2020, 10:18 AM IST
ఆ కారణంగా బిగ్ బాస్ భామ ఆత్మహత్యచేసుకోవాలనీ అనుకుందట..
నందిని రాయ్ Photo : Twitter
  • Share this:
Nandini Rai : నందిని రాయ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ బిగ్ బాస్ బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టోచ్చు. అయితే బిగ్ బాస్‌కు ముందు కొన్ని సినిమాలు చేసినా ఎవరూ ఈ ముద్దుగుమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. నందిని రాయ్ తెలుగులో అడపా దడపా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. రావాల్సినంత గుర్తింపు రాలేదు. అది అలా ఉంటే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వృత్తి జీవితంలో ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా డిప్రెషన్‌కు గురైన ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది నటులు వారు తమ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కోన్న ఒత్తిడి… దాని వలన ఏర్పడే ఆత్మ హత్య వంటి ఆలోచనల గురించి వివిధ వేదికల ద్వారా చర్చించుకుంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగా హీరోయిన్ తాజాగా నందిని రాయ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తాను కూడా ఒక దశలో ఆత్మ హత్య చేసుకోవాలి భావించిందట. నందిని రాయ్ 2015లో మోసగాళ్లకు మోసగాడు మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నందిని రాయ్‌కి ఆ మూవీ విజయం సాధించకపోవడంతో ఆమెకు వచ్చిన ఆఫర్స్ అన్ని పోయాయట. ఈ నేపథ్యంలో నందిని ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుందట. అయితే అనేక వివిధ రకాల కౌల్సిలింగ్‌లతో పాటు ఒత్తిడి తగ్గించడం కోసం ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చిందట.
First published: June 23, 2020, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading