Home /News /movies /

BIGG BOSS TELUGU BEAUTY ARCHANA GETS MARRIAGE SR

కోరుకున్న వాడితో బిగ్ బాస్ భామ పెళ్లి..

సంగీత్‌లో సందడి..

సంగీత్‌లో సందడి..

అర్చన 2004లో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగు అమ్మాయి. అర్చన మంచి నటైన అనుకున్నంతగా పేరుమాత్రం రాలేదు.

    అర్చన 2004లో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగు అమ్మాయి. అర్చన మంచి నటైన అనుకున్నంతగా పేరుమాత్రం రాలేదు. మొదట వేదగా పరిచయమైన ఈ భామ తర్వాత అర్చనగా పేరు మార్చుకుంది. అర్చన ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే అటూ తమిళ, కన్నడ సినిమాల్లోను అలరించింది. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత రియాలీటి షో  బిగ్‌బాస్ తెలుగు సీజన్  1లో పాల్గొని తన టాస్క్‌లు, మాటలతో అదరగొట్టింది. అది అలా ఉంటే అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో కోరుకున్న వాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్చన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈనెల 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది.



    ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.



     




    View this post on Instagram




     

    ✨🦋 #archanashastry #nofilters


    A post shared by Archana Shastry (@archanashastryofficial) on






    తమన్నా లేటెస్ట్ హాట్ పిక్స్..
    First published:

    Tags: Archana, Bigg Boss, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు