Home /News /movies /

BIGG BOSS TELUGU AKHIL FANS UPSET BECAUSE OF THIS REASON HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 4 : ఆటలో అరటిపండుగా మారిన అఖిల్ పరిస్థితి.. కారణం ఆ ఇద్దరేనా..

అఖిల్ Photo : Instagram

అఖిల్ Photo : Instagram

Bigg Boss Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఈసారి కొంత లేటైనా విజయవంతంగా ముగించుకుంది.

  తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఈసారి కొంత లేటైనా విజయవంతంగా ముగించుకుంది. షో నిర్వాహకుల ప్రకారం ఈ సారే అత్యధికంగా షోకు రేటింగ్స్ వచ్చాయని సమాచారం. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గోనగా.. చివరకు టాప్ ఫైవ్‌లో అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా అండ్ హారిక నిలిచారు. వీరిలో నిన్న జరిగిన ఫినాలేలో మొదట హారిక ఎలిమినేట్ అవ్వగా.. ఆ తర్వాత అరియానా బయటకువచ్చింది. ఇక టాప్ త్రీలో అభిజీత్, అఖిల్, సోహెల్ ఉండగా.. సోహెల్ 25 లక్షలతో బయటకువచ్చాడు. ఇక ఫైనల్ విన్నర్ గా అభిజిత్ నిలువగా రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. మొదటి నుంచి కూడా తన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు మైండ్ గేమ్ తో హౌస్ లో కొనసాగిన అభిజిత్ ఎట్టకేలకు విజేతగా నిలవడంతో ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు ప్రేక్షకుల్లో అలానే అభిమానుల్లో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. టాప్ త్రీలో ఉన్న అఖిల్‌కు మాత్రం ఇటు ప్రైజ్ మనీ దక్కలేదు, అటు ట్రోపి లభించలేదు. ముఖ్యంగా నిన్న జరిగిన ఫినాలేలో.. సోహెల్ అందరి హృదయాలను గెలిచాడు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సొహె‌ల్‌‌ ఫినాలేలో తన తండ్రి ఒక హార్ట్ పేషెంట్ అని ఒక కిడ్నీ లేదని, ఇంట్లో పెళ్ళి కావాల్సిన సిస్టర్స్ ఉన్నారు, తను, తన తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదని చెప్పడంతో పాటు వచ్చిన ప్రైజ్ మనీలో కొంత ఛారిటీకి ఇస్తాననడం అందర్ని ఆకట్టుకుంది. ఇక చిరంజీవి తన తదుపరి చిత్రంలో సొహేల్ ఊతపదం ‘కథ వేరే ఉంటది’ను వాడుకోవటానికి అనుమతించాలని సొహెల్‌ను కోరడం ఎంతో బాగుంది. ఇక తన కెరీర్‌కు సహకరించాలనీ సొహేల్ కోరగా, తాను ఒక అతిథి పాత్ర వేస్తానని మెగాస్టార్ మాట ఇవ్వడం.. ఇలా చాలా హైలెట్ అయ్యాడు సోహెల్.  చెప్పాలంటే అభిజీత్ కంటే కూడా సోహెల్ మరింత ఖ్యాతీ గడించాడు. ఒక పది లక్షల రూపాయలను అనాధ ఆశ్రమానికి ఇవ్వనున్నట్లు గా సోహైల్ ప్రకటించటంతో అతడి గొప్ప మనసుని మెచ్చుకున్నా నాగార్జున ఆ డబ్బు అతని వద్దే ఉంచుమని, తాను స్వయంగా రూ. 10 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే కి ప్రత్యేక అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా సోహెల్ గురించి గొప్పగా చెబుతూ అతని కోసం ఇంటి నుండి స్వయంగా బిర్యానీ, మటన్ కర్రీ వంటివి వండించి తీసుకురావడం చూస్తే.. తాజాగా జరిగిన గ్రాండ్ ఫినాలే లో విన్నర్ అభిజిత్ అలానే అందరి మనసును గెలుచుకున్న సోహైల్ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకోవటం జరిగిందని అయితే రన్నరప్ గా నిలిచినటువంటి అఖిల్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు అఖిల్ ఫ్యాన్స్. అటు సోహెల్‌ను ఇటు అభిజీత్‌ను చిరంజీవి, నాగార్జున పొగడుతున్నారు. కానీ అఖిల్‌ను పట్టించుకునేవారే కరువైయారు. అటు ప్రైజ్ మనీ రాకా, ఇటు ట్రోపీ లేక పోవడంతో ఆయన ఫ్యాన్స్ కొంత అసహానం వ్యక్తంచేస్తున్నారు. మావాడు కుమార్ సాయి అన్నట్లు ఆటలో అరటి పండులాగానే మిగిలిపోయాడని అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతూ తమ అభిమాన కంటెస్టంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Bigg Boss 4 Telugu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు